సమంత పేరు మారిపోయింది…

sam

సమంత మతం మారిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్య అక్కినేని ఇంట జరిగిన ఓ ప్రత్యేక పూజా కార్యక్రమంలో.. సమంతతో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించారు. సమంతను హిందువుగా మార్చేశారు. దీనిపై సమంత పేరెంట్స్ చాలా గుస్సా అవుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అది వేరే విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే.. మతం మారడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా సమంత పేరు కూడా మారిపోయిందట.

అవును.. సమంత ఇప్పుడు చిన్న మేడమ్ అయిపోయింది. అన్నపూర్ణ స్టుడియోలో స్టాఫ్ తో పాటు… నాగార్జున ఇంట్లో పనివాళ్లు, స్టాఫ్ కూడా ఇలానే పిలుస్తున్నారు సమంతను. అంతా చుల్ బులీని చిన్న మేడమ్ అనే అంటున్నారు. ఈ కొత్త పిలుపు ఏదో బాగున్నట్టుందని సమంత కూడా ఓకే చెప్పేసిందట. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో పెద్ద మేడమ్ అంటే అమల, చిన్న మేడమ్ అంటే సమంత. అదీ లెక్క. అంతా అలా ఫిక్స్ అయిపోయారు.

మరోవైపు సమంత-నాగచైతన్య కలిసి పెళ్లికి ముందే విదేశాలకు వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యారు. అదేదో డేటింగ్ కోసం అనుకునేరు.. షాపింగ్ కోసం. అవును.. తమ పెళ్లికి దుస్తులు కొనుక్కునేందుకు చైతూ-శామ్ విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఎక్స్ క్లూజివ్ గా లండన్, పారిస్ నగరాల్లో ఓ వారం రోజుల పాటు షాపింగ్ చేయాలని అనుకుంటోందట ఈ జంట.

Loading...

Leave a Reply

*