స‌మంత మ‌తం మార‌డం ఇంట్లోవాళ్ల‌కు ఇష్టం లేదట‌

sam

అక్కినేని అంద‌గాడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి స‌మంత త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది… దీనికి సంబందించి ఇన్నాళ్లు లీకులు వ‌చ్చినా ఇప్పుడు అఫీషియ‌ల్‌గా క‌న్ఫ‌ర్మ్ చేసేశాయి రెండు కుటుంబాలు… స‌మంత‌కు రెండుసార్లు పెళ్లి జ‌రుగుతుంద‌ని మొద‌ట క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో జ‌రిగి ఆ త‌ర్వాత హిందూ సంప్ర‌దాయంలో జ‌రుగుతుంద‌ని మొద‌ట చెప్పారు… ఆ త‌ర్వాత స‌మంత మ‌తం మారింద‌ని, హిందూ మ‌తం తీసుకుంద‌ని ఇప్పుడు ఆమెకు ఒక్క‌సారే హిందూ సంప్ర‌దాయంలో వివాహం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు…అయితే లాస్ట్ మినిట్‌లో సినిమా స్టోరీ లాగానే దీనిలో కూడా ఓ ట్విస్టు వ‌చ్చింది…

ఊహించ‌ని అనూహ్య మ‌లుపు తిరిగింది… స‌మంత మ‌తం మార‌డం ఆమె ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేద‌ట‌.. వాళ్లు దీన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్నారు.. దీంతో స‌మంత క‌థ ఇప్పుడు అచ్చం సినిమా స్టోరీని త‌ల‌పిస్తోంది…. అమ్మానాన్న వ‌ద్దంటున్నారు… మ‌తం మార‌ద్దంటున్నారు… క‌ట్టుకోబోయేవాడితే ఏడ‌డుగులు న‌డిచి మూడు ముళ్లు వేయించుకోవాలంటే మ‌తం మారిపోవాల్సిందే… అక్కినేని ఇంట్లో కోడ‌లిగా అడుగుపెట్టాలంటే వాళ్ల హిందూ సంప్ర‌దాయాల‌ను అనుస‌రించాల్సిందే… ఇలా ఇప్పుడు స‌మంత స‌త‌మ‌త‌మై పోతోందిట‌… మ‌తం కావాలా…

మ్యారేజ్ కావాలా అనే సంఘ‌ర్ష‌ణ‌లో ప‌డిపోయింది స‌మంత‌… ఆమె ఇప్పుడు మ‌తం మార‌క‌పోతే జ‌ర‌గాలి పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీ అన్న‌ట్టు హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల ప్ర‌కారం రెండుసార్లు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది… అయితే పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత‌కు చిక్కులు వ‌స్తాయి… అక్కినేని ఇంటి కోడ‌లిగా హిందూ సంప్ర‌దాయాల‌ను పాటించాలి… అంతేకాదు భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి తిరుమ‌ల వంటి పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లాల్సి వ‌స్తుంది… దీంతో మ‌తం మారాలా అభిమ‌తం మార్చుకోవాలా రెండు సంప్ర‌దాయాలు ఎలా పాటించాలి అంటూ స‌మంత స‌త‌మ‌త‌మైపోతోందిట‌.

Loading...

Leave a Reply

*