పవన్ కోసం ఒట్టు తీసి గట్టున పెడుతుందా…

untitled-41

మంచి పాత్రలు దొరికితే తప్ప సినిమాలు చేయను… ఇది సమంత తాజా స్టేట్ మెంట్. తనకు ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదని ప్రకటించిన సమంత… తెలుగులో ఇప్పటివరకు మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు. జనతా గ్యారేజ్ తర్వాత తెలుగులో ఇంకా బోణీ కొట్టలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. పవన్-త్రివిక్రమ్ సినిమా కోసం ఆమె మరోసారి కాల్షీట్లు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు.

పవన్ కొత్త సినిమాలో సమంత కోసం త్రివిక్రమ్ అదిరిపోయే క్యారెక్టర్ సృష్టించాడట. అత్తారింటికి దారేది, అ..ఆ సినిమాల్లో సమంతకు ఎలాగైతే మంచి పాత్రలు ఇచ్చాడో… అలాగే పవన్ కొత్త సినిమా కోసం కూడా సమంత కోసం ఓ మంచి క్యారెక్టర్ ను క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ను ఇంకా సమంతకు వినిపించలేదు. మరోవైపు త్రివిక్రమ్ అడిగితే సమంత కాదనదనే రూమర్ కూడా ఉంది.

ప్రస్తుతానికైతే సమంత సినిమాలు బంద్ చేయలేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎఁదుకంటే.. ఆమె 2 తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయించింది. కాకపోతే ఆమె తెలుగు సినిమా చేస్తుందా చేయదా అనేదే ఇప్పుడు పెద్ద డౌట్. ఒకవేళ తెలుగు సినిమాలు చేయడానికి ఒప్పుకుంటే కనుక, కచ్చితంగా పవన్-త్రివిక్రమ్ మూవీకి సమంత కాల్షీట్లు కేటాయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Loading...

Leave a Reply

*