సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్న స‌మంత‌-రానా వీడియో..!

untitled-17

స‌మంత-రానా.. అన్నా చెల్లెళ్లు.. కాబోయే..! అవును, నాగ‌చైత‌న్య అక్కినేని.. రానా ద‌గ్గుబాటి బావ‌-బావ‌మ‌రిది. ఇద్ద‌రి మ‌ధ్య ర‌క్త సంబంధం ఉంది. చైతు త‌ల్లి.. రానాకి మేన‌త్త‌. ఇలా ఇద్ద‌రికీ చుట్టరికం ఉంది. అయితే, స‌మంత‌-చైతు ల‌వ్ ఎపిసోడ్ మొద‌ట తెలిసింది కూడా రానాకేన‌ట‌. స‌మంతతో త‌న ప్రేమాయ‌ణం గురించి మొద‌ట రానాకే చెప్పానన్నాడు చైతు ఇటీవ‌ల‌.

అయితే, స‌మంత‌-రానా క‌లిసి ఓ సినిమాలో జంట‌గా న‌టించారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన‌ బెంగళూర్ డేస్‌కి రీమేక్‌గా ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌మిళంలో సినిమా చేశాడు. అది కూడా బెంగ‌ళూర్ డేస్ మూవీనే. ఈ సినిమాలో రానా-స‌మంత జంట‌గా న‌టించారు. మ‌ల‌యాళంలో నిత్యామీన‌న్ చేసిన పాత్ర‌ను త‌మిళంలో స‌మంత పోషించింది. అది గెస్ట్ రోల్‌. చిన్న పాత్ర‌. కానీ, క‌థ‌కు అదే కీల‌కం. అయితే, ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆ సినిమాలో అద్భుతంగా న‌టించారు. ఆ వీడియో ఇప్పుడు తెలుగు వెబ్‌సైట్‌ల‌లో వైర‌ల్‌గా మారింది. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

Loading...

Leave a Reply

*