అన్నీ ఓపెన్ చేసిన స‌మంత‌…!

sam

సమంతకు తెలివితేటలు అపారం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. అన్ని తెలివితేటలు లేకుండా షార్ట్ టైం లో నంబర్ వన్ స్థానానికి ఎలా వచ్చేస్తుందని ప్రశ్నించే వాళ్లు కూడా ఉన్నారు. ఆ తెలివితేటలకు,.. అందం-అదృష్టం కలిసొచ్చాయి కాబట్టే సమంత ఏకంగా టాలీవుడ్ నంబర్ వన్ అయిపోయింది. పైగా ఇప్పుడు అక్కినేని కుటుంబానికి కోడలిగా కూడా వెళ్తోంది. కానీ సమంత మాత్రం తనకు బుర్రలేదంటోంది.

ఇన్నాళ్లూ కేవలం తన అదృష్టం మీదనే ప్రతిది నడిచిందని చెప్పుకొస్తోంది సమంత. ఓ ప్రైవేటు ఫంక్షన్ కు హాజరైన చుల్ బులీ… ఎన్నడూ లేని విధంగా మీడియాతో మరింత క్లోజ్ గా మాట్లాడింది. నా గురించి మీకు తెలియాల్సినవి ఇంకేం ఉన్నాయి చెప్పండంటూ రివర్స్ లో ప్రశ్నించింది. నిజమే సమంత గురించి ఇంక కొత్తగా తెలుసుకోవాల్సినవేం లేవు. అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసేసింది. ఆమె ద‌గ్గ‌ర మ‌న‌తో షేర్ చేసుకోవాల్సిన‌ సీక్రెట్స్ అంటూ ఏమీ లేవ‌ట‌.

ఇందులో భాగంగానే క్లోజ్ గా మీడియాతో మాట్లాడిన సమంత.. తనకు అన్నీ కేవలం అదృష్టం కారణంగానే వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇంత స్థాయికి వచ్చానంటే కేవలం అదృష్టమేనని, తన తెలివితేటలకు పనిచెప్పాల్సిన అవసరం రాలేదని అంటోంది. అయితే ఇప్పుడు మాత్రం బుర్ర పెట్టి ఆలోచిస్తానంటోంది. ఇకపై ప్రతి సినిమాను మరింత సెలక్టివ్ గా, యాక్టింగ్ కు ఆస్కారం ఉన్నట్టుగా ఎంచుకుంటానంటోంది సమంత.

Loading...

Leave a Reply

*