సమంత స్థానం భర్తీచేసేది ఎవరు…?

sam

నో డౌట్… టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ సమంతనే. అనుష్క సినిమాలు చేస్తున్నప్పటికీ, స్టార్ డమ్ ఉన్నప్పటికీ నంబర్ వన్ కాదు. స్టార్ హీరోలందర్నీ కవర్ చేస్తూ, అత్యధిక పారితోషికం తీసుకుంటూ… మొన్నటివరకు రెస్ట్ లేకుండా సినిమాలు చేసిన సమంత… తన నంబర్ వన్ కుర్చీని వదిలి వెళ్లిపోతోంది. ఇకపై సెలక్టివ్ గానే సినిమాలు చేస్తానని, పైగా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ అయితే మరింత ఇష్టంగా చేస్తానని చెప్పి మరీ వెళ్లిపోయింది. మరి సమంత వదిలి వెళ్లిపోయిన ఆ నంబర్ వన్ స్థానంలో ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు. సమంత ప్లేస్ ఇప్పుడు ఎవరికి సొంతం.ప్రస్తుతానికి హీరోయిన్స్ లో సమంత వెళ్లిపోయింది కాబట్టి ఎవరూ నంబర్ వన్ పొజిషన్ లో లేరు.

రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సమంత స్థానం సంపాదించడానికి క్యూరియస్ గా ఉంది. వరుసగా బడా సినిమాలు చేేస్తున్న ఈ భామ, టాలీవుడ్ లో సమంత ప్లేస్ ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు మిల్కీబ్యూటీ తమన్నకు కూడా ఆ స్థానం అందుకునే అర్హతలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న మిల్కీబ్యూటీ… వరుసగా 2 హిట్స్ కొడితే కచ్చితంగా నంబర్ వన్ అనిపించుకుంటుంది.ప్రస్తుతానికైతే నంబర్ వన్ కుర్చీకోసం రకుల్-తమన్న మధ్యే గట్టిపోటీ ఉంది. అయితే రేసులో శృతిహాసన్, రాశిఖన్నా లాంటి తారలు కూడా ఉన్నప్పటికీ… వాళ్లకు అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

Loading...

Leave a Reply

*