స‌మంత‌ను టెన్ష‌న్ పెడుతున్న శ్రుతి

sam

శ్రుతిహాస‌న్‌… అందాల అప‌రంజి బొమ్మ‌…. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రు… అలాంటి శ్రుతి ఇప్పుడు చుల్‌బులీ స‌మంత‌కు టెన్ష‌న్ తెప్పిస్తోంది.. శ్రుతిని చూసి స‌మంత తెగ టెన్ష‌న్ ప‌డిపోతోందిట‌… నానా హైరానా ప‌డుతోంది… స‌మంత కూడా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌… శ్రుతి త‌న‌కు పోటీ ఇస్తుంద‌నో, త‌న ప్లేసు త‌న్నుకుపోతుంద‌నో స‌మంత కంగారు ప‌డ‌డం లేదు… ప్రేమ‌మ్ సినిమాలో శ్రుతి పాత్ర గురించే తెగ ఇద‌యిపోతోందిట స‌మంత‌… ఈ వారం విడుద‌ల కాబోతున్న ప్రేమ‌మ్ రిజ‌ల్ట్ గురించి నాగ‌చైత‌న్య క‌న్నా ఎక్కువ టెన్ష‌న్ ప‌డుతోందిట స‌మంత‌… చైతూ ఇప్ప‌టివ‌కు చాలామంది హీరోయిన్ల‌తో న‌టించినా శ్రుతిహాస‌న్ లాంటి టాప్ హీరోయిన్‌తో ఎప్పుడు న‌టించ‌లేదు.ఈ సినిమాలో శ్రుతి పాత్ర గంట‌కు మించి ఉండ‌క‌పోయినా ఆమెకు ఈ సినిమా కోసం 1.5 కోట్లు ఇచ్చారనేది ఫిలింన‌గ‌ర్ టాక్‌..

ఈ సినిమాలో చైతూ ప‌క్క‌న మ‌ల‌యాళీ క్రేజీ బ్యూటీస్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోనాలు న‌టించినా అంద‌రి దృష్టి మాత్రం చైతూ శ్రుతీలపైనే ఉంది… సినిమాలో వీళ్లిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ కెమిస్ట్రీ ఎలా వ‌ర్క‌వుట్ అయింద‌నే ఆస‌క్తి జ‌నంలో పెరిగిపోయింది… ఈ విష‌యం స‌మంత వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమెకు కూడా ఆస‌క్తి పెరిగిందిట‌… చైతూ శ్రుతీల కాంబినేష‌న్‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాల‌ని స‌మంత త‌హ‌త‌హ‌లాడుతోందిట‌… ఈ విష‌యాల‌ను ముందుగానే దృష్టిలో పెట్టుకున్న స‌మంత ఈ సినిమాలో చైతు, శ్రుతీల మ‌ధ్య నార్వేలో రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు త‌ను కూడా నార్వేకి వెళ్లి సాంగ్ విష‌యంలో కొన్ని సూచ‌న‌లు చేసింద‌ట‌….దీన్నిబ‌ట్టి చూస్తే చైతూ కెరీర్‌పై స‌మంత ఎంత సీరియ‌స్‌గా దృష్టి పెట్టిందో అర్థ‌మ‌వుతుంది. సో శ్రుతి విష‌యంలో స‌మంత ఇలా టెన్ష‌న్ ప‌డింద‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*