బ‌న్ని ఫ్యాన్స్‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇస్తున్న స‌మంత ఫ్యాన్స్‌…!

untitled-14

ఇవాళ ట్విట్ట‌ర్ ప్ల‌స్ సోష‌ల్ మీడియాని ఫాలో అవుతున్నారా..? బ‌న్ని ఫ్యాన్స్‌కి ఇది పండ‌గ రోజు. ట్విట్ట‌ర్‌లో స్ట‌యిలిష్ స్టార్ అభిమానుల సంఖ్య మిలియ‌న్ నెంబర్‌కి చేరింది. అంటే, ట్విట్ట‌ర్‌లో ఆయ‌న‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 10ల‌క్ష‌లు. అంతేకాదు, తెలుగులో ఆ ఫిగ‌ర్‌ను చేరుకున్న ఫాస్టెస్ట్ హీరో అత‌డే. ట్విట్టర్ ట్రెండ్‌లో ఇది ఒక రికార్డ్‌. దీంతో, అల్లు అర్జున్ అభిమానులు దానిని షేర్ చేసుకుంటున్నారు. ఆనందంతో ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో బ‌న్నికి మంచి పాపులారిటీ ఉంది. ఫేస్‌బుక్‌లో కోటి లైక్‌ల‌ను పొందిన తొలి హీరో ఫ్యాన్ పేజ్ ఆయ‌న‌దే. ట్విట్ట‌ర్‌లో తాజాగా కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయ‌న‌కంటే ముందు నుంచే తార‌క్, చెర్రీ వంటి హీరోల‌కి ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్నా.. ఫాలోవ‌ర్స్ సంఖ్య ప‌ది లక్ష‌ల‌కు రీచ్ కాలేదు. ఇక‌, రేసుగుర్రంలోని సినిమా చూపిస్తా మావ సాంగ్ ఏకంగా కోటి హిట్స్‌ను పొందింది. తెలుగులో ఇలా కోటి వ్యూస్‌ని పొందిన తొలి వీడియో సాంగ్ ఇది. ఇది కూడా ఓ సెన్సేష‌న్‌. వీటికి తోడు స‌న్నాఫ్‌స‌త్య‌మూర్తి హిందీ వెర్ష‌న్ మూవీని ఏకంగా 10ల‌క్ష‌ల మందికిపైగా చూశారు. ఓ తెలుగు హీరో డ‌బ్బింగ్ మూవీని ఇలా చూడ‌డం ఇదే తొలిసారి. సోష‌ల్ మీడియాలో అన్ని రికార్డుల‌ను సొంతం చేసుకుంటున్న బ‌న్ని అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు.

బ‌న్ని ట్విట్ట‌ర్ రికార్డ్‌ల‌ను స్ట‌యిలిష్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారో లేదో.. ఇటు, స‌మంత ఫ్యాన్స్ వారికి కౌంట‌ర్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. స‌మంత ట్విట్ట‌ర్ అకౌంట్ 30ల‌క్ష‌ల‌కు పైగానే రీచ్ అయిందంటూ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. అంటే, ఆమె ఫాలోయింగ్‌లో మూడో వంతు కూడా లేద‌న్న‌ట్లు వారి పోస్ట్‌లు చేస్తున్నారు. ఇవాళే స‌మంత ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా 3 మిలియ‌న్‌ల‌కు రీచ్ అయింది. దీంతో, అటు బ‌న్ని ఫ్యాన్స్ ఇటు, స‌మంత అభిమానులు ఒక‌రితో ఒకరు పోటాపోటీగా షేర్‌లు కొడుతున్నారు. మ‌రి, ఎవ‌రి ట్వీట్స్ ట్రెండింగ్‌లోకి వ‌స్తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*