ప్రేమ‌మ్‌కి హిట్ టాక్‌.. స‌మంత సంబ‌రాలు..!

premam

ప్రేమ‌మ్ షో ప‌డింది. స‌మంత సంబ‌రాల‌లో మునిగితేలుతోంది. ఈ సినిమాకి స‌ర్వ‌త్రా హిట్ టాక్ వ‌స్తోంది. అంతే, ఎగిరి గంతేసినంత ప‌ని చేస్తోంద‌ట ఈ బ్యూటీ. ప్ర‌తి వెబ్ సైట్ చూడ‌డం.. ఆ సినిమా రివ్యూ ఎలా రాశారో చ‌ద‌వ‌డం, బావుందంటే వెంట‌నే త‌న ట్వీట్స్‌తో సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం. ఇవాళ ఉద‌యం నుంచి స‌మంత ఇదే ప‌నిమీద ఫుల్ బిజీగా ఉంద‌ట‌. చుల్‌బులీ ట్విట్ట‌ర్ అకౌంట్ చూస్తే.. మొత్తం ఇవాళ ఉద‌యం నుంచి ఇవే ట్వీట్స్ క‌నిపిస్తున్నాయంటున్నారు.

నాగ‌చైత‌న్య లేటెస్ట్ మూవీ ప్రేమ‌మ్‌. ఏడాదిన్న‌ర త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన మూవీ ఇది. ఈ సినిమాకి ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ వ‌చ్చింది. సినిమాకి ఎక్క‌డా నెగిటివ్ కామెంట్స్ ప‌డ‌లేదు. రీమేక్ మూవీయే అయినా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. మూడు డిఫ‌రెంట్ రోల్స్‌లో చైతు అల్టిమేట్ పెర్‌ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించాడ‌ని క్రిటిక్స్ అంగీక‌రిస్తున్నారు. చైతుకి కెరీర్‌లో ఇదే ది బెస్ట్ మూవీ అని, న‌ట‌న ప‌రంగా కూడా మెచ్యూరిటీ పెరిగింద‌నే మాట అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్‌లో చైతు గ‌త చిత్రాల‌తో కంపేర్ చేస్తే బాగా న‌టించాడ‌ని చెప్పుకుంటున్నారు. ఈ కామెంట్స్‌, ఈ రివ్యూస్ అన్నింటినీ స‌మంత ఫాలో అవుతోంది. అందుకే, తాను ఎగిరి గంతేసింత హ్యాపీగా ఉంద‌ని ట్వీట్ చేసింది. ఇలా, ప్రేమ‌మ్ స‌క్సెస్‌తో సంబ‌రాల‌లో మునిగిపోయింది చుల్‌బులీ.

స‌మంత చైతు లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక విడుద‌ల‌యిన మొద‌టి చిత్రం ఇది. ఆమెది గోల్డెన్ లెగ్ అనే ఇమేజ్ ఉంది. అందుకే, త‌న లెగ్ బాగా ప‌ని చేసింద‌ని, కొత్త కోడ‌లు కుటుంబంలోకి అడుగుపెట్ట‌బోయే క్ష‌ణాన.. చైతుకి స‌క్సెస్ అంద‌డం నాగ్ ఫ్యామిలీలోనూ సంబరాలు మిన్నంటుతున్నాయ‌ట‌. దీంతో, స‌మంత‌తో పాటు అక్కినేని కుటుంబం కూడా ప్రేమ‌మ్ స‌క్సెస్‌లో ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, స‌మంత‌కి మాత్రం ప్రేమ‌మ్ స‌క్సెస్ ఓ గుడ్ న్యూస్.

ఇది స‌మంత ట్వీట్‌.. మీరూ చద‌వండి..

When you’re so happy that you don’t know if you should scream or cry or laugh or jump.So I am doing it all together ❤️ #Premam

Loading...

Leave a Reply

*