స‌మంత జాత‌కంలో దోషం… అందుకే పూజ‌లు?

sa

స‌మంత జాత‌కంలో దోషం ఉందా?.. అందుకే ఆమె పెళ్లి విష‌యంలో ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయా??.. ఆ దోషాల‌ను తొల‌గించుకోవడానికే స‌మంత పూజ‌లు చేస్తోందా… తాజాగా నాగార్జున కుటుంబంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి స‌మంత హాజ‌రైంది… స‌మంత‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రు బొట్లు పెట్టుకుని చాప మీద ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని పూజ‌లు చేశారు…. పండితులు ద‌గ్గ‌ర ఉండి వాళ్లిద్ద‌రి చేత పూజ‌లు జ‌రిపించారు.. అయితే స‌మంత‌కు జాత‌కంలో నాగ దోషం ఉంద‌ని లేదా కాల‌స‌ర్ప దోషం కొంద‌రు చెబుతున్నారు…. అందుక‌నే స‌మంత ఇలా పూజ‌లు చేసింద‌ని వాళ్లంటున్నారు… దానికి సంబంధించి కొన్ని రుజువులు, సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు….స‌మంత గ‌తంలో సిద్ధార్థ‌తో ఫ్రెండ్‌షిప్ చేసింది…

ఆ త‌ర్వాత‌ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది…. ఇద్ద‌రు క‌లిసి చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరిగారు… రొమాన్సులో మునిగితేలారు… అప్ప‌ట్లో సిద్ధార్థ‌తో క‌లిసి స‌మంత శ్రీకాళ‌హ‌స్తి వెళ్లి పూజ‌లు చేసింది.. కాళ‌హ‌స్తి అంటేనే కాల‌స‌ర్ప దోష పూజ‌ల‌కు ఫేమ‌స్‌…. అక్క‌డ అమ్మ‌వారు రాహువుకి సంకేతం కాగా అయ్య‌వారు శివుడు కేతువుకు సంకేతం… అందుకే కాల‌స‌ర్ప‌దోషం ఉన్న‌వాళ్లు కాళ‌హ‌స్తి వెళ్లి పూజ‌లు చేయించుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది…. ఈ నేప‌థ్యంలోనే స‌మంత కూడా అప్ప‌ట్లో కాళ‌హ‌స్తి వెళ్లి పూజ‌లు చేయించింది… ఆమె కూడా కాల‌స‌ర్ప దోషం పోవ‌డానికి రాహు, కేతు పూజ‌లు చేసింద‌ని చెబుతారు…

ఇప్పుడు మ‌రోసారి స‌మంత‌కు కాల‌స‌ర్ప‌దోష  నివార‌ణ పూజ‌లు చేయించాల‌ని పండితులు నాగార్జున‌కు చెప్పారుట‌…. అయితే నాగ్ కుటుంబం స‌మంతతో క‌లిసి కాళ‌హ‌స్తి వెళితే అది పెద్ద సెన్సేష‌న్ అవుతుంది.. స‌మంత, చైతూ గురించి మీడియాలో వార్త‌లు వ‌స్తాయి…ఈ త‌ల‌నొప్పులు అన్నీ దేనికి… ఇంట్లోనే పూజ‌లు చేయిద్దాం అనుకున్నారుట‌… దానిప్ర‌కారం అక్కినేని వారి ఇంట్లోనే స‌మంత‌కు కాల‌స‌ర్ప దోష నివార‌ణ పూజ‌లు చేయించారని చెబుతున్నారు. సో స‌మంత‌కు అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోయి త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్కాల‌ని ఆశిద్దాం.

Loading...

Leave a Reply

*