2 సినిమాలు ఓకే… రెండోది మాత్రం సస్పెన్స్…

p

ఇక సినిమాలు చేయదనుకున్న సమంత మళ్లీ ముఖానికి రంగేసుకుంది. ఓ తమిళ సినిమా సెట్స్ పై కూడా ప్రత్యక్షమైంది. రెండు సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. వాటిలో ఒక సినిమా విశాల్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా కాగా…రెండో సినిమా ఏంటనే విషయాన్ని మాత్రం సమంత ఇంకా చెప్పలేదు. దీనిపై ఈమధ్య కాలంలో ఓ రూమర్ వచ్చినా, అందులో నిజం లేదంటోంది చుల్ బులీ.

వచ్చేనెల 5న పవన్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభంకాబోతోంది. ఆ సినిమాలో పవన్ సరసన మరోసారి సమంత హీరోయిన్ గా నటించనుందంటూ వార్తలు వచ్చాయి. అత్తారింటికి దారేది కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ అవుతోందంటూ పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఛాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్న ఎదురైనప్పుడు అలాంటిదేం లేదంటోంది సమంత.

పవన్ సరసన తను నటించబోతున్నాననే వార్తలో నిజం లేదంటోంది చుల్ బులీ. ఎట్ ది సేమ్ టైం.. తను చేయబోయే ఆ రెండో సినిమా ఏంటనే విషయాన్ని కూడా చెప్పడం లేదు. అయితే గుడ్డిలో మెల్లలా పవన్ సినిమాపై క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ట్వీట్ ఛాట్ లో 90శాతం మంది నాగచైతన్య గురించే అడగడంతో… ఉబ్బితబ్బిబ్బయిపోయింది సమంత.

Loading...

Leave a Reply

*