ఆ యువ హీరోయిన్‌తో లేట్‌నైట్ పార్టీలు.. రెజీనాకి షాక్‌..!

sai-dharam-tej

సాయి ధ‌ర‌మ్ తేజ‌.. మెగా ఫ్యామిలీలో జెట్ స్పీడ్‌తో రెయిజ్ అవుతున్న యువ హీరో. మేన‌మామ‌ల వార‌స‌త్వాన్నే కాదు.. వారి బాడీ లాంగ్వేజ్‌ని, డ్యాన్స్ మూమెంట్స్‌ని పుణికి పుచ్చుకున్న క‌థానాయ‌కుడు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న సాయి ధ‌ర‌మ్ తేజ‌పై రూమ‌ర్‌లు కూడా అన్నీ ఇన్నీ కావు. ఆయ‌న ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్‌ల‌తో డేటింగ్ చేశాడ‌నే రూమ‌ర్‌లు వినిపించాయి.

కెరీర్ ప్రారంభంలో వెంట‌వెంట‌నే రెజీనాతో రెండు సినిమాలు చేశాడు సాయిధ‌ర‌మ్ తేజ‌. పిల్లా నువ్వు లేని జీవితంతోపాటు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ అనే రెండు చిత్రాలలో క‌నిపించింది ఈ జంట‌. అంతే, వీరిద్ద‌రిపై పుకార్లు గుప్పుమ‌న్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ రూమ‌ర్‌లు వ్యాపించాయి. అయితే, అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది. ఇద్ద‌రూ ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పారు.

రెజీనా ఎపిసోడ్ ముగిసిందో లేదో.. వెంట‌నే రాశి ఖన్నాతో లింకులు పెడుతూ వార్తలు రాశారు కొంద‌రు. ఇద్ద‌రూ క‌లిసి సుప్రీం మూవీకి సైన్ చెయ్య‌డంతోపాటు, ఒక‌టీ రెండు స్టేజ్ షోల‌పైనా క‌లిసి చిందులేశారు. సుప్రీం సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయింద‌నే కామెంట్స్ వినిపించాయి. దీంతో, రాశి ఖ‌న్నాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, తాజాగా ఆయ‌న కంచె హీరోయిన్‌తో ల‌వ్‌లో ఉన్నాడ‌నే గాసిప్‌లు వస్తున్నాయి.

ఈ ఇద్ద‌రూ క‌లిసి లేట్ నైట్ పార్టీలు, ప‌బ్‌ల‌లో క‌లిసి తిరుగుతున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి. దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌స్తుతం ఈ యువ‌జంట డేటింగ్‌లో ఉన్నారనే రూమ‌ర్‌లు షికారు చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేద‌ని, కేవ‌లం కృష్ణ‌వంశీ మూవీ న‌క్ష‌త్రంలో వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్నారు. ఆ సినిమాలలో వీరు కొన్ని హాట్ హాట్ సీన్‌ల‌లో క‌నిపించాలట‌. దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బిల్డ్ కావాలంటే కాస్త క్లోజ్‌గా మూవ్ కావాల‌ని సూచించాడ‌ట క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ. అందుకే, ఇలా, లేట్ నైట్స్ లో జూబ్లిహిల్స్ లోని ఓ రెస్టారెంట్ లో పరిసరాలను మరిచి మరీ గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారట.

ఒకటి, రెండుసార్లు ఈ ఇద్దరూ ఇలా కనబడితే లైట్ తీసుకునేవాళ్లు. కానీ తరుచుగా చెట్టాపట్టాలేసుకుని ఇద్దరూ ఇదే రెస్టారెంట్ లో కనబడుతుండటంతో గాసిప్పురాయుళ్లు ఈ ఇద్దరూ ప్రేమ కబుర్లు చెప్పేసుకుంటున్నారని ఓ నిర్ణయానికి వచ్చేసారు. మరి వీరి డేటింగ్ ఎక్కడివరకూ వెళుతుందో వేచి చూద్దాం.

Loading...

Leave a Reply

*