స‌మంత మ‌తం మార‌డం వెన‌క అస‌లు క‌థ‌

sama

త్వ‌ర‌లో నాగ చైత‌న్యతో మూడు ముళ్లు క‌ట్టించుకుని ఏడ‌డ‌గులు న‌డ‌వ‌నున్నచుల్‌బులీ స‌మంత మ‌తం మారింద‌నే పుకార్లు షికార్లు చేస్తున్నాయి… పుట్టుక‌తో క్రిస్టియ‌న్ అయిన స‌మంత నాగ్ కోడ‌లిగా, చైతూ భార్య‌గా మార‌నున్న సంద‌ర్భంలో మ‌తం మార్చుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.. చైతూతో పెళ్లి ఖ‌రారయిన త‌ర్వాత స‌మంత హిందూమ‌తంలోకి మారిందంటూ రెండు ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి… నాగార్జున కుటుంబంలో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌కు స‌మంత కూడా హాజ‌రైంది… ఇందులో చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రు కుంకుమ‌బొట్లు పెట్టుకుని చాప మీద ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు… ప‌క్క‌నే నాగార్జున కూడా ఉన్నారు…

మాములుగా అయితే వీళ్లు ముగ్గురు ప‌క్క‌ప‌క్క‌నే ఉండ‌డం పెద్ద విశేషం ఏం కాక‌పోయినా స‌మంత కుంకుమ బొట్టు పెట్టుకోవ‌డంతో అంద‌రు ఆమె హిందూ మ‌తంలోకి మారింద‌ని చెబుతున్నారు…. స‌మంత మతం మార్చుకుంద‌నే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.. క్రిస్టియ‌న్ అయిన స‌మంత హిందూ మ‌తం ఎందుకు పుచ్చుకుంద‌నే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది… ఈమె మ‌తం మారడం వెన‌క అస‌లు క‌థ ఏంటా అని అభిమానులు, జ‌నం ఆరా తీస్తున్నారు… అయితే స‌మంత ఎందుకు మ‌తం మారింద‌నే విష‌యంపై నాగ్‌కు స‌న్నిహ‌తంగా ఉండే వ‌ర్గాలు కొంత స‌మాచారాన్ని వెల్ల‌డిస్తు న్నాయి…

నాగార్జున కుటుంబం అంతా హిందూ సంప్ర‌దాయాల‌ను పాటిస్తారు…. ఇంట్లో పూజ‌లు పున‌స్కారాలు నిర్వ‌హిస్తారు…. ప్ర‌తి ఏటా కుటుంబం అంతా క‌లిసి తిరుమ‌ల కొండ‌కు వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు…. ఇక స‌మంత అక్కినేని ఇంటి కోడ‌లు అయితే వాళ్ల ఆచారాలు పాటించాల్సి ఉంటుంది…. నుదుట బొట్టు పెట్టుకుని పాపిట కుంకుమ ధ‌రించాల్సి ఉంటుంది…. పెళ్ల‌యిన త‌ర్వాత ఇలా హిందూ సంప్ర‌దాయాల‌ను పాటించాల్సి ఉంటుంది క‌న‌క‌నే స‌మంత హిందువుగా మారింద‌ని చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*