ఆ హెలికాప్ట‌ర్ సీన్‌లో హీరో ఒక్క‌డే ఎలా బ‌తికాడంటే…?

untitled-1

ఒక చిన్న నిర్ల‌క్ష్యం.. ఒక చిన్న అజాగ్ర‌త్త‌.. రెండు నిండు ప్రాణాల‌ను బ‌లిగొంది. క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇద్ద‌రు రెయిజింగ్ విల‌న్‌ల పాలిట శాపంగా మారింది. అస‌లు ఆ సీన్ ఏంటంటే… అది క్ల‌యిమాక్స్ ఫైట్‌. ఇద్ద‌రు విల‌న్‌ల‌ను హీరో చిత‌క‌బాదుతుంటాడు. ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి హెలికాప్ట‌ర్ ఎక్కేస్తారు. హీరో కూడా జంప్ చేసి దానిలో ఎక్కుతాడు. హెలికాప్ట‌ర్‌లోనూ హీరో విల‌న్‌ల‌ను మ‌ట్టిక‌రిపిస్తాడు. దీంతో, ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి విల‌న్‌లు ఎగురుతున్న హెలికాప్ట‌ర్ నుంచి చెరువులో దూకేస్తారు. ఇదీ సీన్‌.. కానీ, క‌న్న‌డ సినిమా మాస్తిగుడి క్ల‌యిమాక్స్ సీన్‌లో రిస్క్ ఏమీ లేదు. కానీ, ద‌ర్శ‌కుడితోపాటు సినిమా యూనిట్ తీసుకోని చిన్న చిన్న అజాగ్ర‌త్త‌ల వ‌ల్లే ఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ సీన్‌లో హీరో దునియా విజ‌య్‌.. విల‌న్‌లు ఉద‌య్‌, అనిల్‌పై షాట్ చిత్రీక‌రించారు. విల‌న్‌లు ఇద్ద‌రూ చ‌నిపోగా.. హీరో ఒక్కడే సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు. దీనికి ఓ కార‌ణం ఉంది. హీరో చొక్కా మాటున లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. దీంతో, అత‌ను చెరువులో ప‌డినా.. మునిగిపోకుండా పైకి తేలే ఉన్నాడు. కానీ విల‌న్ వేషాలు వేస్తున్న అనిల్‌, ఉద‌య్‌లు ఆ సీన్‌లో ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా న‌టించాలి. అదే వారిపాలిట య‌మ‌దూత‌గా మారింది. లైఫ్ జాకెట్ వేసుకోవ‌డానికి స్క్రిప్ట్ అనుమ‌తించ‌లేదు. ద‌గ్గ‌ర‌లోనే ఉండి కాపాడాల్సిన మ‌రబోటు మొరాయించింది. ఇది వారికి తెలియ‌దు. మ‌రోవైపు వారికి ఈత కూడా రాదు. అందుకే, ఒక‌రిని ఒక‌రు ప‌ట్టుకొని ఇద్ద‌రూ మునిగిపోయారు. చ‌నిపోయారు.

విల‌న్‌లు ఇద్ద‌రికీ ఈత రాక‌పోయినా.. స్టంట్ మాస్ట‌ర్ ర‌వివ‌ర్మ వారిని ఈ ప్ర‌మాదంలోకి దించాడ‌ని తెలుస్తోంది. ఆయ‌నే ఈ సీన్‌ని ఇలా ప్లాన్ చేశాడ‌ట‌. వారికి ఈత రాద‌ని తెలిసినా.. త‌గిన సేఫ్టీ ప‌ద్ధ‌తులు ఏవీ తీసుకోకుండానే ఇలా ప్లాన్ చెయ్య‌డ‌మే వారిని బ‌లిగొంది. షూటింగ్ స్పాట్‌లో విషాదాన్ని నింపింది. రీల్ సీన్ కాస్త రియ‌ల్‌గా మారింది.

Loading...

Leave a Reply

*