చెర్రీకి వ్యాపారంలో భారీ నష్టం.. అందుకే చిరు ఇంటి నుంచి వేరుకాపురం..!

ramcharan

చెర్రీ, ఉపాస‌న వేరు కాపురానికి రెడీ అయ్యారు.. వేరు కాపురం అంటే చెర్రీ, ఉపాస‌న.. చిరంజీవి కుటుంబం నుంచి వేరుగా ఉండబోతున్నార‌ని కాదు.. ఈ దంప‌తులిద్ద‌రికీ కాస్త ప్రైవ‌సీ కావాల‌ట అందుకే, కొత్త ఇంటికి మార‌బోతున్నార‌ని ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్‌వ్యూలో ఉపాస‌న చెప్పింది. అయితే, దీనివెనుక వేరే కార‌ణం కూడా ఉంద‌ట‌. చెర్రీకి ఇటీవ‌ల బిజినెస్‌లో భారీ న‌ష్టం వ‌చ్చింద‌ని.. అందుకే, ఈ ఇద్ద‌రూ వేరు కాపురం పెడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.ట్రూ జెట్ పేరుతో రామ్‌చ‌ర‌ణ్ దేశీయ విమాన‌యాన రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ద‌క్క‌న్ ప్రాంతంలో ఈ సంస్థ విమానాల‌ను న‌డుపుతోంది. త‌క్కువ సీట‌ర్ కెపాసిటీతో డొమొస్టిక్ ఎయిర్‌లైన్స్‌లోకి ఎంట‌ర్ అయిన చెర్రీ.. ఈ బిజినెస్‌కి భారీ లాభాలు వ‌స్తాయ‌ని భావించాడ‌ట‌.

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ‌, విజ‌య‌వాడ‌-క‌డ‌ప‌, విజ‌య‌వాడ‌-తిరుప‌తి వంటి ప్రాంతాల‌కు కూడా స్పెష‌ల్ ఫ్ల‌యిట్‌లు న‌డుపుతోంది ఈ సంస్థ‌. రాక‌పోక‌లు పెర‌గ‌డం, ఇటు బ‌స్ చార్జీలు, రైల్ ఏసీ చార్జ్‌లు పెర‌గ‌డంతో అంద‌రూ ఫ్ల‌యిట్స్ మార్గాన్ని ఎంచుకుంటార‌ని భావించింది ట్రూ జెట్‌. కానీ, భారీ లాస్‌లు వ‌చ్చాయట‌.హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్ ఫ్ల‌యిట్స్‌కి లాభాలే వ‌చ్చినా.. విజ‌య‌వాడ‌-తిరుప‌తి, విజ‌య‌వాడ‌-క‌డ‌ప మార్గాలు మాత్రం లాస్‌ల‌లో ఉన్నాయ‌ట‌. ఈ రెండు రూట్‌ల‌లో దాదాపు 10 కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ట‌. అయితే, ఆ 10 కోట్ల‌లో సుమారు 4.90 కోట్ల రూపాయ‌లు ఏపీ ప్ర‌భుత్వం ఇవ్వ‌డానికి రెడీ అయింది.

ఎందుకంటే, త‌క్కువ ట్రాఫిక్ ఉన్న రూట్‌ల‌లో విమాన‌యానాన్ని ప్రోత్స‌హించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ స‌ర్కార్‌. దీంతో చెర్రీ డైరెక్ట‌ర్‌గా ఉన్న ట్రూ జెట్ కంపెనీకి ఆ డ‌బ్బులు చెల్లించాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతానికి న‌ష్టాల భారం ఇలా కొంత‌లో కొంత క‌వ‌ర్ అయినా.. ఆ త‌ర్వాత సంగ‌తేంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంద‌ట. దీంతో, ఇల్లు మారితే.. వాస్తు దోషం త‌గ్గి లాభాల బాట ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పార‌ట సిద్ధాంతులు. అందుకే, చెర్రీ-ఉపాస‌న సొంత ఇంటిని నిర్మించుకుంటున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇందులో నిజ‌మెంత అనేది వారికే తెలియాలి.

Loading...

Leave a Reply

*