7 ల‌క్ష‌ల కోసం బోయ‌పాటి-కొర‌టాల మ‌ధ్య ర‌గ‌డ‌…!

boyapati-and-koratala

కొర‌టాల వ‌ర్సెస్ బోయ‌పాటి.. ఇద్ద‌రి మ‌ధ్య హాట్ ఫైట్ సాగుతోంది. రీసెంట్‌గా కొర‌టాల ఇచ్చిన ఓ ఇంట‌ర్‌వ్యూ పెను దుమారానికి దారి తీసింది. ఈ ఇంట‌ర్‌వ్యూలో కొర‌టాల మాట్లాడుతూ సింహా క‌థ త‌నదేన‌ని, కానీ క్రెడిట్ అంతా బోయ‌పాటే కొట్టేశాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఇంత‌వ‌ర‌కు బోయ‌పాటి ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లెజెండ్ 1000 రోజుల ఫంక్ష‌న్‌లో మాట్లాడాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యాడ‌ట‌. అందుకే, బోయ‌పాటి సైలెంట్‌గా ఉన్నాడ‌ని, త్వ‌ర‌లోనే సీమ‌ప్రాంతంలో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్‌లో సీమ ట‌పాకాయ్‌లా రెచ్చిపోనున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది.

అస‌లు గొడ‌వ‌కు రీజ‌న్‌పై బోయ‌పాటి వ‌ర్గాలు భిన్నంగా చెబుతున్నాయి. సింహా సినిమా స్టోరీ లైన్ బోయ‌పాటిదేన‌ట‌. దానిని కాస్త డెవ‌లప్ చేసి ఫుల్ లెంగ్త్ స్టోరీ కోసం ఆయ‌న కొర‌టాల శివ‌తో పాటు మ‌రో న‌లుగురిని పిలిచాడ‌ట‌. అప్ప‌టికి రైట‌ర్‌గానే ఉన్న కొర‌టాల‌.. వెంట‌నే వ‌చ్చాడ‌ట‌. స్టోరీ సిట్టింగ్స్‌లో పాల్గొన్న త‌ర్వాత సినిమా క‌థ టైటిల్స్‌లో త‌న‌కీ క్రెడిట్ ఇవ్వాలని కోరాడ‌ట‌. దానికి బోయ‌పాటి స‌సేమిరా అన్నాడ‌ట‌. క‌థ ఐడియా త‌న‌ద‌ని, దానిని చాలా వ‌ర‌కు తాను డెవ‌ల‌ప్ చేసిన త‌ర్వాత‌.. మిగిలిన వారిని పిలిచాన‌ని, అయినా కొర‌టాల‌కే క్రెడిట్ ఇస్తే మిగిలిన వారి సంగ‌తేంట‌ని ప్ర‌శ్నించాడ‌ట‌. దానికి కొర‌టాల ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ త‌న‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప‌ట్టు బ‌ట్టాడ‌ట‌.

దీంతో, బోయ‌పాటి కొర‌టాల‌కు చెక్ ఫెట్టాడ‌ని.. వెంట‌నే స్టోరీ సిట్టింగ్స్ నుంచి బ‌య‌ట‌కు పంపించాడ‌ని స‌మాచారం. అంతేకాదు, కొరటాల‌కు రావాల్సిన ఏడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కూడా ఇచ్చేశాడ‌ట‌. ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడ‌త‌ల వారీగా నాలుగు వాయిదాల‌లో చెల్లించాడ‌ని స‌మాచారం. ఇదే వాస్త‌వ‌మ‌ని, స‌క్సెస్ వ‌చ్చాక కొర‌టాల అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని బోయ‌పాటి స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రి, ఈ రెండు వెర్ష‌న్‌లలో ఏది నిజ‌మో లెజెండ్ 1000 రోజుల ఫంక్ష‌న్ నాడు తెలియ‌దు. ఎందుకంటే, ఆ రోజు బోయపాటి సైలెన్స్‌కు బ్రేక్ ప‌డ‌డం గ్యారంటీ అంటున్నారు. మ‌రి, ఆ రోజు బోయ‌పాటి ఎలాంటి షాక్‌లు ఇస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*