ఇదే నిజం.. శృతి ఒత్తిడి త‌ట్టుకోలేక‌.. క‌మ‌ల్‌కి గుడ్ బై చెప్పిన గౌత‌మి..?

gouthami

గ‌త రెండు మూడు రోజులుగా వ‌స్తున్న వార్తే నిజ‌మ‌నిపించేలా ఉన్నాయి తాజా పుకార్లు. గౌత‌మి-క‌మ‌ల్ హాస‌న్‌తో 13 ఏళ్ల స‌హ‌జీవ‌న బంధం తెంచుకోవ‌డం వెనుక అస‌లు కార‌ణం శృతిహాస‌నే అని సోష‌ల్ మీడియా కోడై కూసింది. దీనిపై శృతిహాస‌న్ నాకేం సంబంధం అని వివ‌ర‌ణ ఇచ్చినా.. అటు అక్ష‌ర హాస‌న్ సైలెంట్‌గా ఉండాల‌ని అక్క‌కు సూచించినా.. అస‌లు కార‌ణం మాత్రం.. శృతియేన‌ట‌.

శ‌భాష్ నాయుడు షూటింగ్ సంద‌ర్భంగా శృతిహాసన్‌-గౌత‌మి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డిందనే వార్త‌లు వ‌చ్చాయి. స్ట‌యిలింగ్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయట‌. అయితే, ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని, గౌత‌మి త‌న‌కు మ‌ధ్య ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని వివ‌రణ ఇచ్చింది శృతి. అయితే, కొంత‌కాలంగా క‌మల్‌తో గౌత‌మి క‌లిసుండ‌డాన్ని శృతి తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ట‌. అందులో భాగంగానే ఈ మ‌న‌స్ప‌ర్ద‌లు అని స‌మాచారం. గౌత‌మితో బంధం తెంచుకోవాల‌ని క‌మ‌ల్‌కి కూతురు శృతి గ‌ట్టిగా చెబుతుండడంతో ఆయ‌న డైలమాలో ప‌డిపోయార‌ట‌. అటు గౌత‌మికి చెప్ప‌లేక‌, ఇటు కూతురుకి చెప్పుకోలేక క‌మ‌ల్ సందిగ్దంలో ప‌డిపోయిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. దీంతో, ఈ గొడ‌వ‌లు పెరిగి పెద్ద‌వి అవ‌డం కంటే దూరంగా ఉండ‌డ‌మే బెట‌రని ఆలోచించిన గౌత‌మి.. ఆయ‌న‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే, గౌత‌మి నిర్ణయంతో షాక్‌‌కు గురైన కమల్ తీవ్ర మ‌నోవేదన చెందుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం కథలు వినిపించడానికి చాలామంది దర్శకులకు ఇచ్చిన డేట్స్ సైతం క్యాన్సిల్ చేసి, నిశబ్ద వాతావరణంలోకి కమల్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా, గౌతమి తీసుకున్న నిర్ణయం కమల్‌పై తనకున్న గౌరవం, ప్రేమకు నిదర్శనమని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*