షాకింగ్‌.. సినిమాల‌కు గుడ్ బై.. ర‌వితేజ రిటైర్‌మెంట్‌…?

untitled-2

మాస్ మ‌హ‌రాజ్‌.. వార‌సులే రాజ్య‌మేలుతున్న నేటి తెలుగు సినిమా ప్ర‌పంచంలో ఎలాంటి అండా దండా లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన మ‌న‌లో ఒక‌డు. టాలీవుడ్ బ‌డా హీరోల‌లో ఒక‌డు. సినిమాల‌పై ఆయ‌న విసిగిపోయారా? ఏడాదిగా ర‌వితేజ ఎందుకు సినిమాలు చెయ్య‌డం లేదు..? ఇక‌, ఆయ‌న రిటైర్‌మెంట్‌కు రెడీ అవుతున్నారా? ఇటీవ‌ల ఆయ‌న ఆలోచ‌న‌లు, సినిమా సినిమాకి తీసుకుంటున్న గ్యాప్ చూస్తుంటే.. మాస్ మ‌హరాజ్ ఇలాంటి ఆలోచన‌లే చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌యిన బెంగాల్ టైగ‌ర్ తర్వాత మాస్ మ‌హ‌రాజ్ మూడు సినిమాల‌కు సైన్ చేశాడు. ఒక్క‌టి కూడా సెట్స్‌పైకి రాలేదు. దిల్ రాజు నిర్మాత‌గా ఓ మూవీతోపాటు, మ‌రో రెండు చిత్రాల‌కు ప‌చ్చ‌జెండా ఊపాడు. అవేవీ సెట్స్‌పైకి రాలేదు. రీసెంట్‌గా ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు బాబీతోనూ ఓ మూవీ క‌మిట‌య్యాడు. అది కూడా పెండింగ్‌లో ప‌డింది. ఇటు, కొత్త ద‌ర్శ‌కుడు చంటితో రాబిన్‌హుడ్ అనే మ‌రో సినిమా షురూ చెయ్యాల‌ని భావించాడు. అది కూడా ఇంత‌వ‌ర‌కు ఫైన‌ల్ కాలేదు. ఇలా, కొత్త సినిమాల‌కు సైన్ చెయ్య‌క‌పోవ‌డంతో పాటు, సైన్ చేసిన చిత్రాలు డ్రాప్ అవ‌డం కూడా ర‌వితేజ కెరీర్‌పై ఆలోచ‌న‌లు రేకెత్తిస్తోంది.

మ‌రోవైపు, రీసెంట్‌గా పూరి జ‌గ‌న్నాధ్‌.. ర‌వితేజ‌పై ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని వినిపించాడు. కెరీర్‌పై విసిగిపోయాడ‌ని, ప్ర‌పంచ టూర్ వేసిన త‌ర్వాతే సినిమాల‌పై ఆలోచిస్తాడ‌ని తెలిపాడు. ఆ టూర్‌కి త‌న‌ను కూడా ఆహ్వానించాడ‌ని, తాను కూడా ఆ విష‌య‌మై డైల‌మాలో ఉన్నాన‌న్నాడు. అంటే, ప్రెజెంట్ మాస్ మ‌హ‌రాజ్ కొత్త సినిమాల గురించి ఆలోచించే స్థితిలో లేడ‌న్న‌మాట‌. అంతేకాదు, కెరీర్‌లో మ‌రో రెండు మూడు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని చెబుతున్నారు మ‌రికొంద‌రు. ఏది ఏమైనా.. ర‌వితేజ షాకింగ్ డెసిష‌న్‌తో మ‌న‌కి షాక్ ఇస్తాడేమో చూడాలి.

Loading...

Leave a Reply

*