ఈసారి కచ్చితంగా వస్తానంటున్నాడు…

raviteja

అప్పుడెప్పుడో 10 నెలల కిందట ఓసారి కనిపించాడు. అంతే మళ్లీ పత్తా లేడు. ఈ గ్యాప్ లో కనీసం మరో సినిమా ఫంక్షన్ లో కూడా కనిపించలేదు రవితేజ. పూర్తిగా ప్రైవేటు లైఫ్ కే ఫిక్స్ అయిపోయాడు. మాస్ రాజా సినిమా కోసం చాలామంది జనాలు ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు రవితేజ ముహూర్తం ఫిక్స్ చేశాడు. దర్శకుడ్ని కూడా పక్కా చేశాడు.తాజా సమాచారం ప్రకారం… దర్శకుడు బాబితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రవితేజ డిసైడ్ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా దసరాకు ప్రారంభమయ్యే అవకాశా పుష్కలంగా ఉన్నాయి. నిర్మాత కూడా ఓకే అయిపోయాడు.

బాబి చెప్పిన కథతో రవితేజ హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ ఫై అయినట్టు తెలుస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో పవర్ సినిమా వచ్చింది.బాబి కన్ ఫర్మ్ అవ్వడంతో.. ఇప్పటివరకు చర్చల్లో ఉన్న దర్శకులు అంతా సైడై పోయినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ… రాక్ లైన్ వెంకటేష్ నిర్మాణంలో రవితేజ చేయాల్సిన సినిమా కూడా ఆగిపోయినట్టు తెలుస్తోంది. అటు సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు బాబి కూడా… రవితేజ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.

Loading...

Leave a Reply

*