అందరూ పోయారు.. ఇప్పుడు మరోకడు వచ్చాడు..

ravi

రవితేజ సినిమా చేస్తాడో చేయడో తెలీదు కానీ.. దర్శకులు మాత్రం సీజన్ కు ఒకరు మారిపోతూనే ఉన్నారు. మొన్నటివరకు బాబి, గోపీచంద్ మలినేని, వేణుశ్రీరాం, పరశురాం లాంటి పేర్లు వినిపించాయి. వాళ్లలో ఎవరితో మాస్ రాజా సినిమా చేయడం లేదని తేలిపోయింది. ఇకపై సినిమా చేస్తాడో లేదో తెలీదు కానీ… తాజాగా తెరపైకి మరో దర్శకుడు మాత్రం వచ్చి చేరాడు. అతడే చందూ మొండేటి.ఈమధ్యే ప్రేమమ్ ఓ డీసెంట్ హిట్ కొట్టాడు చందు మొండేటి.

నిజానికి ప్రేమమ్ టైపు సినిమాలు చేయడం చందు మొండేటికి ఇష్టం ఉండదు. అతడికి సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ సినిమాలు చేయడం ఇష్టం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ప్రేమమ్ రీమేక్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా కాస్తా హిట్ అవ్వడంతో… రవితేజ నుంచి మొండేటికి పిలువు వచ్చిందట.తన కోసం కూడా అలాంటి ఓ సెన్సిబుల్ కథ రాయమని రవితేజ మొండేటిని కోరాడట. నిజానికి రవితేజకు అలాంటి సినిమాలు బాగుండవు.

అప్పుడెప్పుడో మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లాంటి సినిమాలు చేసినా.. ఈమధ్య కాలంలో పూర్తిగా మాస్ కే ఫిక్స్ అయిపోయాడు మాస్ రాజా. అలాంటి హీరో చందు మొండేటికి కబురుపెట్టి సున్నితమైన ప్రేమకథను తన కోసం రాయమని కోరాడంటే ఎవరూ నమ్మరు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న టాక్స్ అలా ఉన్నాయి మరి. దీనిపై చందు ఏమంటాడో చూడాలి.

Loading...

Leave a Reply

*