ఆ హీరో గెస్ట్ హౌజ్ లో రాశీఖన్నా…?

rasi

ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ లో ఉంది రాశిఖన్నా. ఆమె ఎఫ్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతోంది. బడా స్టార్స్ సరసన అవకాశాలు అందిపుట్టుకునే దిశగా దూసుకుపోతోంది ఈ భామ. ఇదిలా ఉండగా… సౌత్ లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమౌతోంది రాశి. కుదిరితే తమిళ్ లో కూడా జెండా పాతేసేందుకు రెడీ అవుతోంది. అందుకే హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. నిజానికి హీరోయిన్లు హైదరాబాద్ లో ఇళ్లు కొనుగోలు చేయడం కొత్తేంకాదు. రాశీ ఖన్నాతో పాటు…. సమంత, తమన్న, చార్మి, శృతిహానస్, రకుల్, శ్రద్ధాదాస్.. ఇలా చాలామంది భామలకు హైదరాబాద్ లో ఇళ్లు ఉన్నాయి. కానీ రాశీఖన్నా మేటర్ మాత్రం వేరు.

ఓ ప్రముఖ హీరో గెస్ట్ హౌజ్ ను రాశీఖన్నా కొనుగోలు చేసిందట. అది కూడా చాలా తక్కువ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది.అసలు ఆ ప్రముఖ హీరో ఎవరనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఆ హీరో కేవలం రాశి ఖన్నాకు మాత్రమే తన గెస్ట్ హౌజ్ ను ఎందుకు అమ్మాడనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు తన గెస్ట్ హౌజ్ ను అమ్ముకోవాల్సిన అవసరం ఆ హీరోకు ఎందుకొచ్చిందనే ప్రశ్న కూడా స్టార్టయింది. ఏది ఏమైనా… ఆ హీరో గెస్ట్ హౌజ్ లో రాశి ఖన్నా మకాం పెట్టిందనేది మాత్రం వాస్తవం. త్వరలోనే తన కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయాలనుకుంటోంది రాశి ఖన్నా.

Loading...

Leave a Reply

*