అతగాడి చేతిలో పడిన రష్మి

untitled-3

కొందరు భామలు కొందరి చేతుల్లో పడితేనే అందం. అప్పుడే వాళ్లకు స్టార్ డమ్. వాళ్ల అందాలకు ఓ సార్థకత వస్తాయి. ప్రస్తుతం రష్మి కూడా అదే అదృష్టాన్ని అనుభవిస్తోంది. ఈమె దగ్గర అందాలున్నాయి. కానీ వాటిని చూపించే స్టార్ డైరక్టర్ మాత్రం దొరకడం లేదు. అందుకే అడవికాచిన వెన్నెల్లా తయారైంది రష్మి. ఇన్నాళ్లకు ఈమెను పూర్తిస్థాయిలో ఓదార్చే దర్శకుడు దొరికాడు. అతడే మారుతి. ఇప్పుడంటే ఈ దర్శకుడు క్లీన్ అండ్ కామ్ అయిపోయాడు కానీ, ఒకప్పుడు మారుతి సినిమాలు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అలాంటి దర్శకుడి చేతిలో ఇప్పుడు రష్మి పడిందనే వార్త గుప్పుమంటోంది.

రీసెంట్ గా బాబు బంగారం సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టిన మారుతి.. తన నెక్ట్స్ మూవీని రష్మీతో ప్లాన్ చేశాడట. కెరీర్ స్టార్టింగ్ లో డైరెక్టర్ మారుతి ఈరోజుల్లో, బస్ స్టాప్ లాంటి యూత్ కంటెంట్ ఉన్న సినిమాలను కొత్తవాళ్లతో తీసి సూపర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. అలాగే నిర్మాతగా కూడా మారుతి ఈ తరహా సినిమాలతో బాగానే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇదే తరహాలో యూత్ కంటెంట్ ఉన్న ఓ బోల్డ్ సినిమా చేయడానికి మారుతి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు ఈ సినిమాలో రష్మీని హీరోయిన్ గా తీసుకోవాలని మారుతి నిర్ణయించుకున్నట్లు స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ సినిమాను మారుతి సొంతంగా నిర్మించనున్నాడని తెలుస్తోంది. అయితే, సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తాడా? లేక వేరే ఎవరికైనా మెగాఫోన్ అందిస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా మారుతి హ్యాండ్ పడితే రష్మి జాతకం మారిపోవడం ఖాయం అంటున్నారు చాలామంది. ఆమె కెరీర్ జబర్దస్ట్ గా ఊపందుకుంటుందని అంటున్నారు.

Loading...

Leave a Reply

*