నీచమైన పని చేయించిన బాలీవుడ్ హీరో…

ranveer

తమ అభిమాన హీరోని చూసేందుకు, అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, కుదిరితే అతడితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఆ అభిమానాన్ని అలుసుగా తీసుకున్నాడు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్. నడిరోడ్డుపై తన ఫ్యాన్స్ తో బట్టలు ఊడదీయించాడు. తన షేక్ హ్యాండ్ కావాలా.. అయితే ప్యాంట్లు విప్పండంటూ హుకుం జారీచేశాడు.తన కోసం అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధమే అని ముందుకొచ్చిన వారితో నడిరోడ్డుపై వారి ప్యాంట్లు విప్పించాడు. ముంబైలో ఓ షాపు ఓపెనింగుకు వచ్చిన సందర్భంగా రణవీర్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డారు. రణవీర్ సింగ్ అభిమానుల పట్ల ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని, అభిమానుల పట్ల అతడు ఇలా ప్రవర్తించి ఉండకూడదని, ఎంత అభిమానులైతే మాత్రం ఇలా చేయడం ఏమిటంటూ కొందరు విమర్శిస్తున్నారు.

సరదాగా చేసిందే అని కొందరు అయితే దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని, ఆయన సరదాగా ఈ పని చేశాడని… ప్యాంట్లు విప్పిన వారితో సహా కొందరు అభిమానులు ఆయనకు మద్దతు ఇచ్చారు.అదే స్థానంలో మహిళలు ఉంటే రణవీర్ ఏం చేసేవాడంటూ మరికొందరు అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు. ఏదేమైనా రణ్వీర్ చేసిన పనికి సోషల్ మీడియాలో అతడిపై బాగానే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు షర్ట్ విప్పాలంటూ కోరిన అభిమానుల ఆశ నెరవేరకుండానే రణ్వీర్ అక్కడ్నుంచి జంప్ అయిపోయాడు.

Loading...

Leave a Reply

*