షాకింగ్‌.. భ‌ల్లాల‌దేవుడి విశ్వ‌రూపం ఇది..?

ran

ఇది భ‌ల్లాల‌దేవుడి విశ్వ‌రూపం. రానాది మంచి బాడీ. బాహుబ‌లి సినిమాలోనే అది క‌నిపించింది. ఇక అప్పుడప్పుడూ జిమ్ వ‌ర్క‌వుట్స్ చేసిన టైమ్‌లో తీసిన ఫోటోల‌లో రానా ఫిజిక్ చూసి అంద‌రూ షాక్ అయ్యారు. కానీ, ఈ కనిపించే లుక్‌.. రీసెంట్‌ది. సిక్స్ ప్యాక్ కాదు.. దాని తాత‌ను కూడా భ‌య‌పెట్టేలా ఉంది క‌దూ ఆయ‌న ఫిజిక్‌. బాహుబ‌లి లాంటి న‌వ‌లా నాయ‌కుడితో పోటీ ప‌డాలంటే.. భ‌ల్లాల‌దేవ ఎలా ఉండాలి. కానీ, ఇప్పుడు ఈ భల్లాల‌దేవుడిని చూస్తుంటే.. బాహుబ‌లి కూడా ఒక అడుగు వెన‌క్కివేసేలా ఉంది క‌దూ.

 

భ‌ల్లాల దేవుడిని చంపాలంటే.. బుద్ధిబ‌లంతోనే కాదు.. భుజ బలంతో కాదు అని స‌వాల్ విసురుతున్న‌ట్లుంది రానా ఫిజిక్‌.రానా మంచి హెయిట్‌. హెయిట్‌కి త‌గ్గ వెయిట్‌. దానికి త‌గ్గ శ‌రీర సౌష్ఠ‌వం. ఇప్పుడు ఈ ఫోటోని క‌నుక హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలు చూస్తే వారు కూడా ఆఫ‌ర్‌లు ఇవ్వ‌డం గ్యారంటీ. ఇక‌, డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ టీమ్‌లో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా ప్లేస్ దొరుకుతుంది. ఏదేమైనా రానా షాక్ ఇచ్చాడు క‌దూ.

Loading...

Leave a Reply

*