మాస్టర్ బ్రెయిన్ కే స్ట్రోక్ ఇచ్చాడు…

ramcharans

అల్లు అరవింద్ బ్యానర్ లో ధృవ సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు వచ్చింది. సినిమాకు సంబంధించి ఓ యాంగిల్ లో అల్లు అరవింద్ కు, చరణ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య సరైన సక్సెస్ లేని చెర్రీ.. ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని పట్టుదలతో భారీ స్థాయిలో ధృవకు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగా ‘ధృవ’ ను నిర్మిస్తోన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ కు చెందిన పీఆర్వో లను దూరం పెడుతూ కొత్త పీఆర్ టీమ్ లకు చెర్రీ ప్రమోషన్స్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు ఫ్యామిలీ షాక్ అయినట్లు తెలుస్తోంది.

బడా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఫ్యామిలీకి కత్తిలాంటి పీఆర్ టీమ్స్ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళను పక్కనపెట్టడంపై స్వయంగా అల్లు అరవింద్ షాక్ అయ్యాడట. ప్రమోషన్ విషయాన్ని తనకు వదిలేయమని చెర్రీ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చెర్రీ తన సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను… బాహుబలికి పనిచేసిన ఆర్కా మీడియాకు, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ను వెనకుండి సూపర్ హిట్ చేసిన పీఆర్ టీమ్ కు అప్పగించాడని ఇన్నర్ టాక్.

ఈ నిర్ణయంతో ఇటు మెగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తమ బాధను చెర్రీ ముందు ఉంచినట్లు సమాచారం. ఎన్టీఆర్ అంటే పడిచచ్చే పీఆర్ టీమ్ కు ధృవ బాధ్యతలను అప్పగించడం కరెక్ట్ కాదనే వాదనను వాళ్ళు వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు గాని.. ధృవ విషయంలో మాత్రం చెర్రీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

Loading...

Leave a Reply

*