అప్పుడు 400 ఏళ్లు… ఇప్పుడు 25 ఏళ్లు….

ma

తెలుగుతెరపై పీరియాడిక్ సినిమాలు కొత్తకాదు. ఎటొచ్చి వాటిని చేస్తున్న హీరోల్ని చూస్తేనే ప్రేక్షకులు పొంగిపోతుంటారు. తమ హీరో అలాంటి కథల్లో ఎలా కనిపిస్తాడో చూడాలని ఎక్సైట్ అవుతుంటారు. తాజాగా రామ్ చరణ్ సినిమా ఒకటి ఇదే జానర్ లోకి ఎంటర్ అయిందనే వార్తలు గుప్పుమంటున్నాడు. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేయబోయే సినిమా ఇలానే పాతికేళ్ల కిందటి కథతో తెరకెక్కబోతోందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ అంతటా వినిపిస్తోంది.

మగధీర సినిమాలో చెర్రీ మళ్లీ పుడతాడు. 400ఏళ్ల కిందటి కథ అది. ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం అంత వెనక్కి వెళ్లకపోయినా… పాతికేళ్ల కిందటి కథలో చెర్రీ సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు.. కేవలం ఓరచూపులు, సైకిల్ పై ఫాలో అవ్వడాలు లాంటి సన్నివేశాలు మాత్రమే ఉండేవి. సరిగ్గా అలాంటి కథతోనే చెర్రీ-సుకుమార్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమకథలో చెర్రీని కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట సుకుమార్. పీరియాడిక్ డ్రామా సినిమాలు చేయడం చరణ్ కు కొత్తకాదు. గతంలో మగధీర చేశాడు. ఇక పల్లెటూరి వాతావరణం కూడా చెర్రీకి కొత్తకాదు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించాడు. ఎటొచ్చి పల్లెటూరి కుర్రాడిలా కనిపిచండం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అందుకే మెగాఫ్యాన్స్ లో అంత క్యూరియాసిటీ.

Loading...

Leave a Reply

*