ఉపాసన రిఫరెన్స్ తో చెర్రీకి కథ వినిపించాడు…

upasana

తన కెరీర్ లో రామ్ చరణ్ ఎప్పుడైనా కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడా… ఇప్పటివరకైతే అలంటి పని చేయలేదు. భవిష్యత్తులో చేస్తాడని కూడా ఎవరూ అనుకోరు. ఎందుకంటే మెగా కాంపౌండ్ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతుంది. అక్కినేని హీరోల్లో రిస్కీ ప్రాజెక్టులు చేయరు. అప్పటికే హిట్ కొట్టిన దర్శకులకే ఛాన్స్ లు ఇస్తుంటారు. కానీ చెర్రీ మాత్రం ఇప్పుడు రూటు మార్చాడు. ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. అది కూడా ఉపాసన రిఫరెన్స్ తో వచ్చిన కుర్రాడికి ఛాన్స్ ఇస్తాడట.

ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. ధృవ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ అయితే… సుక్కూ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ కొత్త దర్శకుడితోనే సెట్స్ పైకి వెళ్తాడట చరణ్. ఇంతకీ ఈ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా.. అచ్చంగా కౌబాయ్ కథను చెర్రీకి వినిపించాడట.

గతంలో చిరంజీవి కొదమసింహం, కొండవీటిదొంగ లాంటి సినిమాల్లో కౌబాయ్ గా కనిపించాడు. ఇక ఈ తరహా పాత్రలకు కృష్ణ ఆద్యంపోశారు. అటు మహేష్ బాబు కూడా టక్కరిదొంగతో కౌబాయ్ గా మారాడు. సో.. ఇప్పుడు చరణ్ కూడా తండ్రి బాటలో కెరీర్ లో తొలిసారిగా కౌబాయ్ గా మారే ఆలోచనలో ఉన్నాడట. అయితే చెర్రీ ఛాన్స్ ఇస్తున్న ఆ కొత్త కుర్రాడు ఎవరనేది మాత్రం సస్పెన్స్.

Loading...

Leave a Reply

*