రాంచరణ్ 100 కోట్ల ఇల్లు రెడీ

ram-charan

చిరంజీవి తనయుడు… అపోలో వారి అల్లుడు రాంచరణ్ ఓ ఇంటివాడవుతున్నాడు. అదేంటి ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు కదా అని ఆశ్చర్యపోకండి. రాంచరణ్ ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకొనే పనిలో వున్నాడు. ఓ సామాన్యుడు ఇల్లు కట్టాలి అంటేనే ఎన్నో ప్లాన్స్ వేస్తాడు. వున్నదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టి ఇల్లు పూర్తి చేస్తాడు. మరి ఎక్కడ ఇల్లు కడుతుంది రాంచరణ్. మరి ఆ ఇల్లు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. మీరంతా బుర్ర బద్దలు కొట్టుకోకుండానే ఓ లెక్క బయటకొచ్చింది.

ఆ లెక్క ప్రకారం 100 కోట్లు ఖర్చుపెట్టి రాంచరణ్ తన సొంత ఇంటిని తీర్చి దిద్దుతున్నాడట. తానే దగ్గరుండి ఇంటికి సంబందించిన ఇంటీరియర్ పనులు తానే చేసుకుంటున్నాడట. సకల హంగులతో తన అభిరుచికి తగినట్లు కొత్త ఇంటిని చెర్రీ దంపతులు పూర్తి చేస్తున్నారట.

Loading...

Leave a Reply

*