భర్తతో కలిసి ఉంటా.. అనుమతించండి.. ప్లీజ్

untitled-1

రంభ నయా స్టేట్ మెంట్ ఇది. ప్రస్తుతం భర్తకు దూరంగా జీవితాన్ని గడుపుతున్న రంభ.. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుంది. తన మొగుడ్ని వదిలి ఉండలేకపోతున్నానని, తనతోనే జీవితాన్ని పంచుకుంటానని అంటోంది. అనడం కాదు.. ఏకంగా చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిందట. తనను, తన భర్తను కలపాలంటూ కోర్టును కోరుతోందట.

2010 ఏప్రిల్ లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ ను వివాహం చేసుకున్న రంభ.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి అందమైన వైవాహిక జీవితాన్ని హ్యాపీగా కొనసాగించారు. కానీ, ఇప్పుడు వీరి వైవాహిక జీవితం సందిగ్ధంలో పడిపోవడం బాధాకరం. వీరి మధ్య ఏవో సమస్యలు, చిన్న చిన్న గొడవలు తలెత్తడంతో గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారట. ఇక ఇప్పుడేమో ఈ స్టోరీ ఓ కొత్త మలుపు తీసుకుంది.

తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన రంభ.. ప్రస్తుతం భర్తతో కలిసి తనకు మళ్ళీ జీవితాన్ని పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరిందట. అలాగే తాను ఇకపై భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నానని, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరుతూ రంభ పిటిషన్ దాఖలు చేసిందట. ఇక ఈ కేసు వచ్చే డిసెంబర్ 3న విచారణకు రానుందని సమాచారం. మరి భర్తతో తిరిగి కలిసుండాలనే రంభ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Loading...

Leave a Reply

*