హైప‌ర్ దుమ్ము దులుపుతోందిగా..!

hyper

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ హైప‌ర్‌. ఈ సినిమాకి మొద‌ట యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. సెంటిమెంట్‌తోపాటు ఇత‌ర ఎమోష‌న్స్ బాగానే ఉన్నా.. కాస్త యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌యింద‌నే కామెంట్స్ వినిపించాయి. కానీ, క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది హైప‌ర్ చిత్రం. మూడు రోజుల‌కే ఈ చిత్రం 8 కోట్ల 50లక్ష‌ల షేర్ సాధించింది. రామ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌.

రామ్-రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన రెండో చిత్రం ఇది. గ‌తేడాది వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో శివ‌మ్ వంటి ఫ్లాప్ చిత్రం వ‌చ్చింది. దీంతో, ఫ్లాప్ పెయిర్ అనే ముద్ర ప‌డింది. కానీ, ఇప్పుడు ఆ ఇమేజ్‌ని చెరిపేసుకుంది ఈ జంట‌. హిట్ పెయిర్‌గా నిలిచింది హైప‌ర్‌తో. అందాల భామ రాశి ఖ‌న్నాకి ఇది ఈ ఏడాది రెండో విజ‌యం. ఇటు రామ్‌కి కూడా అంతే. నేను శైల‌జ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీ ఇది.

కందిరీగ వంటి విజ‌య‌వంత‌మైన మూవీతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ ర‌భ‌స‌తో కాస్త డ‌ల్ అయ్యాడు. అది ద్వితీయ విఘ్నం దాట‌లేకపోయిన సంతోష్ శ్రీనివాస్‌.. హైప‌ర్‌తో మ‌ళ్లీ రెయిజ్ అయ్యాడు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌లు చెయ్య‌డంలో త‌న మార్క్ ఏంటో చూపించాడు. తొలి మూడు రోజుల‌కే మంచి వ‌సూళ్లు పొందిన హైప‌ర్‌.. ద‌స‌రా సీజ‌న్‌లో మ‌రింత స్ట్రాంగ్‌గా నిల‌బడే చాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్ప‌టికే, తెలంగాణ‌లో విజ‌య‌ద‌శ‌మి సెల‌వుల‌తో సోమవారం కూడా థియేట‌ర్ల‌న్నీ నిండిపోయాయి. బుధ‌వారం నుంచి అటు ఏపీలోనూ సెల‌వులే. సో.. అక్క‌డ కూడా వీక్ డేస్‌లోనూ ఆక్యుపెన్సీ రేషియో పెర‌గ‌డం గ్యారంటీ. మొత్త‌మ్మీద‌, రామ్ బ్యాక్ టు బ్యాక్ మ‌రో విజ‌యం ద‌క్కించుకున్నాడ‌న్న మాట ఈ ఏడాది.

Loading...

Leave a Reply

*