నానిని అడ్డంగా ముంచిన రామ్‌…!

ram

నానికి రామ్ షాక్ ఇచ్చాడు. వ‌ర‌స విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నానికి ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాడు రామ్.  నేచుర‌ల్ స్టార్ నాని హవాకి బ్రేక్ వేశాడు ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో. నాని లేటెస్ట్ మూవీ మ‌జ్ను విడుద‌లై వారం రోజులు. వ‌న్ వీక్ గ్యాప్‌లోనే రామ్ హైప‌ర్‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌చ్చాడు. నాని మ‌జ్ను రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌గా తెర‌కెక్కింది. ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఏ సెంట‌ర్‌ల‌లో ప‌ర్లేద‌నిపించినా.. బీ, సీ కేంద్రాల‌లో అంత‌టి రెస్పాన్స్ రాలేదు. దీంతో, నిర్మాత‌ల‌కు కాస్త లాస్‌లు త‌ప్పేలా లేవు.

గతేడాది ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుంచి నిన్న‌టి జెంటిల్‌మ‌న్ వ‌ర‌కు నాని నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాడు. భ‌లే భ‌లే మగాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మేన్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్‌ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నానికి.. మ‌జ్ను సో సో అనిపించుకుంది. మ‌రో వారం గ్యాప్ ఉంటే గ‌ట్టెక్కేదే. కానీ, ద‌స‌రా సీజ‌న్‌ను క్యాష్ చేసుకునేందుకు రామ్ హైప‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కందిరీగ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ ఫాద‌ర్‌-స‌న్ సెంటిమెంట్ మూవీకి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా మాస్‌కి రీచ్ అయ్యేలా క‌నిపిస్తోంది.

తండ్రీకొడుకుల అనుబంధం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంట‌ర్‌ట‌యిన‌ర్ కావ‌డంతో ఏ సెంట‌ర్‌ల‌లోనూ బాగానే కనెక్ట్ అవుతుంది. ఇక‌, రేప‌టి నుంచి తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు. సో. మ‌జ్ను వ‌సూళ్లు మ‌రింత డ్రాప్ అవ‌డం ఖాయం. హైప‌ర్‌కి ఈ వారం క‌లెక్ష‌న్లు ఫుల్ రేంజ్‌లోనే ఉంటాయంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. 6వ తేదీ నుంచి ఏపీలోనూ ద‌స‌రా హాలీడేస్ వ‌స్తాయి. ఆ త‌ర్వాత చైతు ప్రేమ‌మ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. సో.. మ‌జ్ను బుక్ అయిపోయిన‌ట్లే. ఇలా, రామ్‌.. నానిని అడ్డంగా ముంచాడు రామ్‌.

Loading...

Leave a Reply

*