హైప‌ర్‌తో రామ్ పంట పండింది.. అంత రేటా..?

ram-and-rassi

రామ్ హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ హైపర్‌. ఈ సినిమాపై భారీ బెట్టింగ్ న‌డుస్తోంది. రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్‌కి ద‌క్కించుకున్న హైప‌ర్‌.. శాటిలైట్ మార్కెట్‌లోనూ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా 6.3 కోట్ల రూపాయ‌ల‌కు జీ టీవీ నెట్ వ‌ర్క్ గ్రూప్ కొనుగోలు చేసింది. రామ్ కెరీర్‌లో ఓ సినిమాకి ఈ రేంజ్‌లో శాటిలైట్ ధ‌ర ప‌ల‌క‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. బాల‌య్య‌, నాగ్‌, వెంకీ, ర‌వితేజ‌ వంటి బ‌డా హీరోల సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ప‌లుకుతాయి. రామ్ కూడా వారి స‌ర‌స‌న నిల‌వ‌డం విశేషం.ఈ వీకెండ్ కానుక‌గా విడుద‌ల కానుంది ఈ చిత్రం. కందిరీగ, రామ‌య్యా వ‌స్తావ‌య్యా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

తండ్రీకొడుకుల అనుబంధం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది ఈ మూవీ. హైప‌ర్‌కి ముందు రామ్ న‌టించిన నేను శైల‌జ చిత్రం మంచి విజ‌యం సాధించింది. దీంతో ఆయ‌న మార్కెట్ పెరిగింది. మ‌రోవైపు, టీజ‌ర్‌తోనే భారీ అంచ‌నాలు పెంచేసింది హైప‌ర్‌. జిబ్రాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అదిరిపోయింది. ఇక‌, అందాల‌రాశి రాశి ఖ‌న్నా గ్లామ‌ర్ కూడా మ‌రో ఎస్సెట్‌. స‌త్య‌రాజ్, న‌రేష్ కేర‌క్ట‌ర్ రోల్స్ పోషించ‌డం సినిమా రేంజ్‌ని పెంచింది. దీంతో, హైప‌ర్ డిమాండ్ పెరిగింది. జీ టీవీ తాజాగా జీ సినిమాలు అనే కొత్త చానెల్‌ని కూడా లాంచ్ చేసింది. ఇలా, హైప‌ర్‌కి అన్నీ క‌లిసొచ్చాయి.

Loading...

Leave a Reply

*