రామ్‌.. హైప‌ర్ ప్రివ్యూ..!

hyper

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ.. హైప‌ర్‌.  నేను శైల‌జ వంటి భారీ హిట్ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌స్తున్న ఈ మూవీపై అంచ‌నాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. కందిరీగ త‌ర్వాత రామ్‌-సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నమూవీ హైప‌ర్‌. వ‌ర‌స విజ‌యాల‌తో క్లీన్ ఎంట‌ర్ ట‌యిన‌ర్‌లు అందిస్తున్న 14రీల్స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న మూవీ ఇది. రిలీజ్‌కు ముందు వ‌చ్చిన‌, తర్వాత విడుద‌ల చేసిన థియేట‌ర్ ట్ర‌యిల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో, అంతా పాజిటివ్ బ‌జ్‌తో విడుదల అవుతోంది హైప‌ర్‌. ఈ మూవీ ప్రీవ్యూని ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది తెలుగుపెన్.నెట్‌..

తండ్రి కొడుకు సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. హీరో రామ్‌కి తండ్రి అంటే ప్రాణం. కాదు ఆయన సినిమా డైలాగ్‌లో  చెప్పిన‌ట్లు పిచ్చి. తండ్రిని గెలిపించే కొడుకు క‌థ హైప‌ర్‌. చిన్న‌ప్ప‌టి నుంచే హీరో తండ్రి చాటు బిడ్డ‌గా ఎదుగుతాడు. అమ్మకంటే నాన్న అంటేనే అమిత‌మైన ప్రేమ‌, వాత్స‌ల్యం. ఎంత‌గా అంటే, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ఎవ‌రైనా అమ్మా అని అరుస్తారు. నాన్న అని ఎందుకు అన‌రు అని ప్ర‌శ్నించే అంత‌గా ఇష్టం రామ్‌కి.  చిన్న‌ప్ప‌టి నుంచే రామ్‌కు త‌ల్లి తుల‌సి కంటే తండ్రి స‌త్య‌రాజ్ అంటే అంత ప్రేమ‌. అయితే అనుకోని కార‌ణాల‌తో హీరో అంత‌గా ప్రేమించే ఓ తండ్రి ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుపోతాడు. త‌న తండ్రి ఇరుక్కున్న స‌మ‌స్య నుంచి తండ్రిని హీరో ఎలా సేవ్ చేశౄడు? హీరోయిన్ రాశిఖ‌న్నాతో త‌న ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడు ? విల‌న్ల భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? అన్న‌దే హైప‌ర్ స్టోరీ అట‌.

సినిమాకి మెయిన్ థ్రెడ్ అయిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడట‌ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్‌. ట్ర‌యిల‌ర్స్‌లో చూపించిన‌ట్లు తండ్రీకొడుకుల రిలేష‌న్‌లోని కామెడీ యాంగిల్‌నే కాదు.. టీజ‌ర్స్‌లో లేని ఎమోష‌న‌ల్ సీన్స్‌ని కూడా మెస్మ‌రైజింగ్ రేంజ్‌లో ప్రెజెంట్ చేశాడని సమాచారం. ఇక‌, రామ్‌, స‌త్య‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే సీన్‌లు సినిమాకి హైలైట్ అవుతాయ‌ని అంచ‌నా. సినిమాకి ఇవే కీల‌కంగా మార‌తాయ‌ట‌. ఫస్టాఫ్‌లో రాశి ఖ‌న్నా ల‌వ్ సీన్స్ కూడా బాగా వ‌చ్చాయ‌ని చెప్పుకుంటున్నారు. సెకండాఫ్‌లో విల‌న్‌-హీరో గేమ్ సినిమాకి మ‌రో ప్ల‌స్ పాయింట‌నే టాక్ వినిపిస్తోంది. సినిమాకు కామెడీ+ఫాద‌ర్ సెంటిమెంట్‌+సెకండాఫ్ యాక్ష‌న్ హైలెట్‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

రీసెంట్‌గా ఫాద‌ర్ రోల్స్‌కి కేరాఫ్‌గా మారాడు స‌త్య‌రాజ్‌. మిర్చి నుంచి నేటి హైప‌ర్ వ‌ర‌కు ర‌క‌రకాల వేరియేష‌న్స్ ఉన్న తండ్రి పాత్ర‌ల‌లో మెప్పించాడు. మ‌రోసారి తండ్రి పాత్ర‌లో స‌త్య‌రాజ్ అద‌ర‌గొట్టాడు. ఇక‌, రామ్ మ‌రోసారి రెచ్చిపోయాడు. ఆయ‌న ఎన‌ర్జీ సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. ప్ర‌తి సీన్‌లోనూ కొత్త‌గా క‌నిపిస్తాడు. సెంటిమెంట్, రొమాన్స్‌, ఫైట్స్‌తో పాటు.. కామెడీ టైమింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడ‌ట రామ్. ఇక‌, రాశి ఖ‌న్నా గ్లామ‌ర్, షార్ట్ డ్ర‌స్‌ల‌లో ఆమె క‌నిపించిన తీరు యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ట‌.

ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే పాట‌లు బాగా ఎక్కాయి. చార్ట్ బ‌స్ట‌ర్స్‌లో ఈ పాట‌లే మార్మోగుతున్నాయి. టోట‌ల్‌గా కందిరీగ కాంబినేష‌న్ మ‌రో స‌క్సెస్‌పై ధీమాగా ఉంది. అయిదేళ్ల త‌ర్వాత అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు హైప‌ర్‌తో రెడీ అవుతున్నారు రామ్‌-సంతోష్ శ్రీనివాస్‌. ఈ మూవీతో ర‌భ‌స ఫ్లాప్ నుంచి గ‌ట్టెక్క‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

 

Loading...

Leave a Reply

*