హైప‌ర్ సెన్సార్ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే…..!

hyper

ఈ వీకెండ్‌న విడుద‌ల కానుంది రామ్ హైప‌ర్‌. నేను శైల‌జ వంటి సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో రామ్ నుంచి వ‌స్తున్న మూవీ ఇది. ఈ సినిమా4పై భారీ అంచ‌నాలున్నాయి. కందిరీగ త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్- రామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సెకండ్ మూవీ ఇది. ఇటు, ట్ర‌యిల‌ర్‌కి కూడా భారీ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. కొద్దిసేప‌టి క్రితం సెన్సార్ పూర్తి చేసుకుంది రామ్ హైప‌ర్‌. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

తండ్రీకొడుకుల రిలేష‌న్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది హైప‌ర్‌. తండ్రి అంటే హీరోకి ప్రాణం. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న రోల్ మోడ‌ల్ తండ్రే. అయితే, అనుకోని కార‌ణాల‌తో తండ్రి ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటాడు. దానినుంచి హీరో ఎలా తండ్రిని కాపాడాడు..? అన్న‌దే క‌థ‌. ట్ర‌యిల‌ర్స్‌లో చూపించిన‌ట్లు.. ఫ‌స్ట్ హాఫ్ మొత్తం.. ఎంట‌ర్‌ట‌యిన్‌మెంట్ ఉంటుంది. రామ్‌-స‌త్య‌రాజ్ మ‌ధ్య రిలేష‌న్ బిల్డ్ చేసే ఎక్కువ‌గా కనిపిస్తాయి. ఇటు, హీరో-హీరోయిన్ రొమాన్స్ సీన్స్‌తో చాలా ఫ‌న్నీగా, సాఫీగా సాగుతుంది క‌థ‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ నుంచి స్టోరీ కొత్త జంప్ తీసుకుంటుంది. సెకండాఫ్‌కి కావాల్సిన మ‌సాలా ఇంట‌ర్‌వెల్‌లోనే ప‌డుతుంది.

రెండో అర్ధ‌భాగం యాక్ష‌న్ సీన్స్‌దే డామినేష‌న్‌. పగ‌, ప్ర‌తీకారాల‌తో సాగుతుంది. విల‌న్‌-హీరో గేమ్‌తో సాగుతుంది. విల‌న్ గ్యాంగ్‌ని హీరో ఎలా మ‌ట్టిక‌రిపించాడ‌నేది హైలైట్‌. కందిరీగ‌లో ఉన్న‌ట్లే ఈ సినిమాలో క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీ ఉంటుంది. సినిమాకి అదే మెయిట్ ఎట్రాక్ష‌న్ అవుతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కాన్‌ఫిడెంట్‌గా ఉన్నారు. 14 రీల్స్ ఎంట‌ర్‌ట‌యిన్‌మెంట్ ఈ సినిమాని నిర్మించింది. దూకుడు సినిమాకి వీరే నిర్మాతలు. దూకుడులానే ఇది కూడా తండ్రీకొడుకుల ఎమోష‌న్ సెంటిమెంట్‌తో నిండి ఉంటుంది. దూకుడులో సెంటిమెంట్ డోస్ ఎక్కువ‌యితే.. ఇక్కడ దానిని ఫ‌న్నీగా, ఎంట‌ర్‌ట‌యిన్‌మెంట్ మోడ్‌లో సాగుతుంది. క్ల‌యిమాక్స్‌తోపాటు మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే సీన్‌లు కూడా కంట‌త‌డి పెట్టిస్తాయ‌ట‌. నేను శైల‌జ‌లో స‌త్య‌రాజ్‌-రామ్ సీన్‌లు బాగా పండాయి. ఈ సినిమాలోనూ అంత‌కంటే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతాయ‌ట‌.

ర‌న్ టైమ్ త‌క్కువ ఉండ‌డం సినిమాకి క‌లిసి వ‌చ్చే అంశం. 2 గంట‌ల 15 నిముషాల మాత్ర‌మే సినిమా ఉంటుంద‌ట‌. ఇదే సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంద‌ని భావిస్తున్నారు. రాశి ఖన్నా అందాలు సినిమాకి మ‌రో ప్ల‌స్. ట్ర‌యిల‌ర్స్‌లో ఆమె ఎంతో గ్లామ‌ర‌స్‌గా కనిపిస్తోంది. గ‌త సినిమాల‌తో కంపేర్ చేస్తే గ్లామ‌ర్ డోస్ కూడా కాస్త పెంచింది. జిబ్రాన్ మ్యూజిక్ సినిమాకి అద‌న‌పు బ‌లం. పాట‌లు బాగా హిట్ అయ్యాయి. మ‌రి, టోట‌ల్‌గా సినిమా ఎలా ఉంద‌నేది ఈ నెల 30న తేల‌నుంది.

 

Loading...

Leave a Reply

*