నాకు కుల‌పిచ్చి… ప్ర‌భాస్ రాజు అంటే చాలా ఇష్టం..అంటున్న ద‌ర్శ‌కుడు..!

prabha

కొంత‌మంది మేథావి అంటారు. మ‌రికొంద‌రు పిచ్చోడు అంటారు. ఇంకొక‌రు వివాదాల‌కు కేరాఫ్ అని పిలుస్తారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. చెయ్యాల్సింది చేస్తారు.. చెప్పాల్సింది చెబుతారు. ట్వీట్‌ల‌తో సంచ‌ల‌నం క్రియేట్ చేసే రామ్ గోపాల్ వ‌ర్మ‌.. తాజాగా త‌న ట్వీట్స్‌తో మ‌రోసారి పెను దుమారానికి తెర‌దీశారు. ఈసారి ఆయ‌న త‌న‌కు కులపిచ్చి ఉందంటూనే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భాస్ రాజు అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఎందుకంటే త‌న‌ది, ప్ర‌భాస్‌ది ఒకే కుల‌మ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్‌లు సాధార‌ణంగా చేసిన‌వి కాదు. కొన్ని రోజుల క్రితం.. అక్టోబ‌ర్ 22వ తేదీన బాహుబ‌లి 2 సెట్స్‌లో ఉన్న ప్ర‌భాస్‌ని మెగాస్టార్ చిరంజీవి క‌లిశాడు. ఆయ‌న‌ని క‌లిసి కౌగిలించుకున్నాడు. త‌న సినిమా సెట్స్‌పైకి వ‌చ్చిన మెగాస్టార్‌ని చూసి ప్ర‌భాస్ సాద‌రంగా ఆహ్వానించాడు. ఆ త‌ర్వాతి రోజే ప్ర‌భాస్ బ‌ర్త్ డే ఉండ‌డంతో చిరు ప్ర‌భాస్‌కి పుట్టిన‌రోజు విషెస్ చెప్పాడు. ఈ ఫోటో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటోపై వర్మ ఇప్పుడు కుల క‌ల‌ర్ ఇస్తున్నారు. త‌నదైన శైలిలో ట్వీట్స్‌తో హంగామా క్రియేట్ చేస్తున్నారు.

చిరంజీవిని ప్ర‌భాస్‌, రెబ‌ల్‌స్టార్‌ని మెగాస్టార్‌.. మ‌న‌స్ఫూర్తిగా కౌగిలించుకున్నారంటే అది వారి మూర్ఖ‌త్వ‌మే అని వ‌ర్మ ట్వీట్ వేశాడు. అంతే ట్విట్ట‌ర్‌మీడియా షేక్ అయింది. ఆయ‌న‌ను స‌మ‌ర్ధించే వారు కొంద‌రు, కౌంట‌ర్ ఇచ్చేవారితో ట్విట్ట‌ర్‌లో మోత మోగింది. ఆ త‌ర్వాత త‌న ఉద్దేశ్యాన్ని బ‌య‌ట‌పెట్టిన వ‌ర్మ‌..దానిపై స‌వివరంగా ట్వీట్‌లు పోస్ట్ చేశాడు. ప్ర‌భాస్ అంటే త‌న‌కి కూడా చాలా ఇష్ట‌మ‌ని, అదే టైమ్‌లో చిరంజీవిని ద్వేషించ‌డం కూడా క‌ష్ట‌మ‌ని అన్నారు.

త‌న‌కు కుల‌పిచ్చి చాలా ఎక్కువ‌గా ఉంద‌ని, అందుకే ప్ర‌భాస్ రాజు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు వ‌ర్మ‌. కాపుల‌పై చిరంజీవికి ఎలాంటి ఫీలింగ్స్ లేవ‌ని, కేవ‌లం క‌మ్మ‌వారు మాత్ర‌మే ఇందుకు కార‌ణం చెప్ప‌గ‌ల‌ర‌ని అన్నాడు రామూ. ఈ ట్వీట్స్‌పై అభిమానులు తిట్ల దండ‌కం అందుకున్నారు. ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఈ తిట్ల దండ‌కంతో ఆయ‌న కాస్త వెన‌క్కి త‌గ్గారు. చాలా మంది అభిమానులు త‌న ఇంగ్లీష్‌ని స‌రిగ్గా అర్ధం చేసుకోలేర‌ని వాళ్లు త‌న‌ని క్ష‌మిస్తున్నాన‌ని చెప్పడం విశేషం.

Loading...

Leave a Reply

*