రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన రామ్‌.. ఆయ‌న‌నే కాపీ కొట్టాడు…!

ram-and-rajamouli

వ‌ర్చువ‌ల్ రియాలిటీ.. ఇదీ రాబోయే కొత్త టెక్నాల‌జీ. ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని తానే టాలీవుడ్‌కి పరిచ‌యం చేస్తున్నాన‌ని ఓపెన్‌గా చెప్పాడు రాజ‌మౌళి. దీనికోస‌మే బాహుబ‌లి 2 మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని కూడా వివ‌రించాడు. ఏద‌యినా షాట్‌ని వ‌ర్చువ‌ల్‌రియాలిటీ 360 డిగ్రీల‌లో చూడొచ్చ‌ని.. ఇది గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని, ఇలాంటి సాంకేతిక ప‌రిజ్ఞానంతో బాహుబ‌లి 2 స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని తెగ అంచ‌నాలు వేసుకున్నాడు. సౌత్‌లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా మొట్ట‌మొద‌ట‌గా ఈ టెక్నాల‌జీతో సినిమాని అందిస్తున్న‌ది తామే అని భ‌లే సంతోషంగా ఉన్నాడు రాజ‌మౌళి.

సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవ‌డంలో గ్రాఫిక్స్ మాయాజాలంలో రాజ‌మౌళికి సాటిలేర‌న్న అంచ‌నాల‌ను హైప‌ర్ టీమ్ బ‌ద్ద‌లు కొట్టింది. రాజ‌మౌళి కలలు కంటున్న వ‌ర్చువ‌ల్ రియాలిటీని రామ్ హీరోగా వ‌చ్చిన హైప‌ర్ సినిమా యూనిట్ వాడేసింది. ఈ టెక్నాల‌జీతో తెర‌కెక్కిన ఓ పాట‌ను కూడా రిలీజ్ చేసింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో, తానే ఫ‌స్ట్ అనుకుంటున్న టెక్నాల‌జీని ఆయ‌న కంటే ముందే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి షాక్ ఇచ్చాడు రామ్‌. ఇలా, రాజ‌మౌళి చేద్దామ‌నుకున్న దానిని ముందే ఆడియెన్స్‌కు ప‌రిచయం చేసి మార్కులు కొట్టేశాడు రామ్‌.

Loading...

Leave a Reply

*