అల్లు అర‌వింద్‌కి షాక్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్

ram-charan-shock-to-allu-aravind

వ‌రుస ఫ్లాపుల‌తో వ‌ర్రీ అవుతున్న చెర్రీ త‌న మేన‌మామ‌కు షాక్ ఇచ్చాట్ట‌… అల్లు అర‌వింద్‌కు గుండె జ‌ల్లుమ‌నేలా ఝ‌ల‌క్ ఇచ్చాట్ట రామ్ చ‌ర‌ణ్‌…మామ‌కు అల్లుడు కాజా తినిపించాడు… వ‌రుస విజ‌యాల‌తో బ‌న్నీ దూసుకుపోతుంటే వ‌రుస ఫ్లాపుల‌తో చెర్రీ వ‌ర్రీ అయి క‌ర్రీ అయిపో తున్నాడు… ఇద్ద‌రి మ‌ధ్య క‌న‌ప‌డ‌ని విభేదాలు ఉన్నాయ‌ని ఇండస్ట్రీ జ‌నం చెప్పుకుంటుంటారు… అయితే బ్రూస్‌లీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్కాబోర్లా ప‌డ్డాక… రామ్‌చ‌ర‌ణ్‌, చిరు ఇద్దరు మ‌ళ్లీ గీతా ఆర్ట్స్ అర‌వింద్‌ని శ‌ర‌ణుజొచ్చారు… ధ్రువ సినిమాకు నిర్మాత‌లుగా దాన‌య్య వెన‌క‌, ఎన్‌వీ ప్ర‌సాద్ ప‌క్కన ఉండ‌గా సినిమా మాత్రం అర‌వింద్ పేరుతో త‌యార‌వుతోంది…

అయితే ఈ సినిమా విష‌యంలో మేన‌మామ‌కు మేన‌ల్లుడు ఝ‌ల‌క్ ఇచ్చాడని స‌మాచారం… సినిమా మొద‌ట్నించి అర‌వింద్ స్కూల్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్‌లో ముందుకు వెళ్ల‌డం లేద‌ని స‌మాచారం… మ‌రీ ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్ పూర్త‌య్యాక సినిమా ప్రొడ‌క్ష‌న్‌లో చాలా తేడాలు వ‌చ్చాయ‌ని రాను రాను ధ్రువ ప్రొడ‌క్ష‌న్స్‌లో గీతా అర్ట్స్‌కు చెందిన మ‌నుషులు త‌గ్గుతున్నార‌ని స‌మాచారం…. ఈ విష‌యాల‌న్ని అల్లు అర‌వింద్‌కు తెలుస్తూనే ఉన్నా ఆయ‌న ఏమీ అన‌లేక మౌనం వ‌హిస్తున్నాడ‌ని స‌మాచారం… చివ‌రకు ఇప్పుడు గీతా ఆర్ట్స్‌కు ప‌ర్మ‌నెంట్‌గా ఉన్న పీఆర్వోల‌ను కూడా మార్చేశార‌ని చెబుతున్నారు…

ఈ పీఆర్వోలు బ‌న్నీకి, శిరీష్‌కి అత్యంత విధేయులు కావ‌డంతోనే వీళ్ల‌పై వేటు ప‌డ్డ‌ట్టు స‌మాచారం…. ఈ విష‌యం తెలుసుకున్న అల్లు అర‌వింద్ చ‌ర‌ణ్‌తో మాట్లాడితే…. లైట్ తీసుకో మామ అన్నాట్ట‌…. ఈమ‌ధ్య కాలంలో చ‌ర‌ణ్‌కు ద‌గ్గ‌ర‌యిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ వేటు వ్య‌వ‌హారంలో పాత్ర పోషించారుట‌.. వెబ్ మీడియాను మేనేజ్ చేయాలంటే వీళ్ల‌ను మార్చేయాల్సిందే అని వాళ్లు చెప్ప‌డంతోనే చ‌ర‌ణ్ ఈ స్టెప్ తీసుకున్నార‌ని వినికిడి…. మొత్తానికి గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా నిర్మాణం అల్లు అర‌వింద్ ప్ర‌మేయం లేకుండానే సాగిపోతుండ‌డం విశేషం….ఇలా రామ్‌చ‌ర‌ణ్ గీత దాటి మామ‌కు మ‌డ‌త‌కాజా తినిపించాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది.

Loading...

Leave a Reply

*