రామ్‌చ‌ర‌ణ్ అత్తారింటి సెల్ఫీ..!

raatha

చెర్రీ బంధువులంతా ఆల్‌మోస్ట్ మ‌న‌కు తెలుసు. ఇటు తండ్రివైపు చుట్ట‌రికంలో దాదాపు అంద‌రినీ ఏదో ఒక ఫంక్ష‌న్‌లో మ‌నం ఇప్ప‌టికే చూశాం. అటు త‌ల్లి త‌ర‌ఫు బంధువులను కూడా మ‌నం చూశాం. మేన‌మామ అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా సుప‌రిచ‌త‌మే. అయితే, చెర్రీ అత్తారింటి గురించి మ‌న‌కు తెలిసింత కాస్తే. అపోలో సి.ప్ర‌తాప‌రెడ్డి మ‌న‌వ‌రాలు ఉపాస‌న కామినేనిని ఆయ‌న మ‌నువాడాడు. ఆనాటి పెళ్లి వేడుక‌లో చిరు ఫ్యామిలీతో పాటు క‌లిసి వారు షేర్ చేసుకున్న ఫోటోలు మ‌న‌కు ద‌ర్శ‌న‌మిచ్చాయి. కానీ, ఉపాస‌న సిస్ట‌ర్స్‌తో ఆయ‌న రీసెంట్‌గా ఓ సెల్ఫీ దిగాడు. దానిని ఉపాసన త‌న సోష‌ల్ మీడియా ప‌ర్స‌న‌ల్ సైట్‌ల‌లో అప్‌లోడ్ చేసింది. అంతే, అది వైర‌ల్‌గా మారింది.

ఈ ఫోటోలో ఉపాస‌న త‌ల్లితోపాటు ఆమె ఇద్ద‌రి సిస్ట‌ర్స్ కూడా ఉన్నారు. అందుకే, మామ్‌.. మై సిస్ట‌ర్స్.. స‌ర్‌ప్రైజ్ సెల్ఫీ అంటూ కామెంట్ పెట్టింది. నిజంగానే ఇది స‌ర్‌ప్రైజ్ సెల్ఫీ.. అత్తారింట్లో అల్లుడు చేసే స‌ర‌దా ప‌నులు, మ‌ర‌ద‌ళ్ల‌తో బావ‌గారి స‌ర‌దా సంబాష‌ణ‌లతో క‌ల‌క‌లలాడుతున్న‌ట్లు ఉంది క‌దూ ఈ సెల్ఫీ. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటు, మెగాభిమానులు సైతం దీనిని షేర్ చేసుకుంటున్నారు. అత్తారింటికి ద‌స‌రా సెల‌వుల‌కు వెళ్లిన‌ట్లుంది క‌దూ ఈ ఫోటో.

Loading...

Leave a Reply

*