ఖైదీ నంబర్-150లో అతిపెద్ద షాక్ అదే…

chiru

చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నంబర్-150. ఈ సినిమా టైటిల్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని యాంగిల్స్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఐటెంసాంగ్ పిక్చరైజేషన్ కూడా పూర్తయింది. సినిమాకు ఐటెంసాంగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అటు చిరంజీవి లుక్స్ కూడా అదుర్స్ అంటున్నారు. చిరు-కాజల్ పెయిర్ కూడా అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ఒకెత్తు. సినిమాలో ఉన్న ఓ సీక్రెట్ ఎలిమెంట్ మరో ఎత్తు.

అవును.. ఖైదీ నంబర్-150లో ఊహించని ట్విస్ట్ ఒకటి ఉందట. ఆ ట్విస్ట్ సినిమాకు చాలా చాలా ఇంపార్టెంట్ అట. ఆ ట్విస్ట్ లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కనిపిస్తాడనేది తాజా వార్త. అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు మేకర్స్. సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఎలిమెంట్ చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వాలనే ఉద్దేశంతో.. కావాలనే సీక్రెట్ గా ఉంచుతున్నారట.

రామ్ చరణ్ నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేశాడు. కానీ చిరంజీవి సినిమాల్లో మాత్రం చరణ్ గెస్ట్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నిజానికి ఈ పాత్రలో మొదట పవన్ కల్యాణ్ ను అనుకున్నారట. కానీ ఏవో లెక్కలు వేసి, ఫైనల్ గా చెర్రీకే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాత్రం మేకర్స్ ఎట్టిపరిస్థితుల్లో బయటపెట్టాలని అనుకోవడం లేదు.

Loading...

Leave a Reply

*