జ‌న‌తాతో కంపేర్ చేస్తే, ధృవ‌, శాత‌క‌ర్ణి రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

movies

ద‌స‌రా కానుక‌గా రెండు బ‌డా సినిమాల టీజ‌ర్‌లు విడుద‌ల‌య్యాయి. రామ్‌చ‌ర‌ణ్ ధృవ‌తోపాటు, బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ కూడా మార్కెట్‌లోకి వ‌చ్చింది. ఈ రెండు సినిమాల టీజ‌ర్‌ల‌కు ఊహించినంత రెస్పాన్స్ రాలేద‌నే టాక్ వినిపిస్తోంది. ధృవ టీజ‌ర్ యూ ట్యూబ్‌లో పోస్ట్ అయిన 15 గంట‌ల‌కు 1 మిలియ‌న్ అంటే 10ల‌క్ష‌ల వ్యూస్‌ని పొందింది. అదే బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి 20 గంట‌ల‌లో ఆ స్థాయి హిట్స్‌ని ద‌క్కించుకుంది. ఇక‌, 24గంట‌ల వ్య‌వ‌ధిలో ధృవ 15 ల‌క్ష‌ల వ్యూస్‌ని పొందింది. చెర్రీ సినిమాల‌లో ఇది ఓ రికార్డ్.

అయితే, ఈ రెండు సినిమాల టీజ‌ర్‌లు రీసెంట్‌గా విడుద‌ల‌యిన జ‌నతా గ్యారేజ్ టీజ‌ర్‌తో కంపేర్ చేస్తే ఫ్లాప్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌.. జ‌న‌తా గ్యారేజ్. టాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ 3లో నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా టీజ‌ర్ ప‌రంగానూ రికార్డులు కొల్ల‌గొట్టింది. విడుద‌ల‌యిన 6 గంట‌లకే ల‌క్ష వ్యూస్‌ని పొందింది. ఇక‌, 24 గంట‌ల‌కు అది రెండు మిలియ‌న్‌ల‌కు రీచ్ అయింది. బాహుబ‌లి త‌ర్వాత ఆ రేంజ్‌లో వ్యూస్‌ని పొందిన టాలీవుడ్ మూవీ ఇదే అని చెబుతారు. బాహుబ‌లి కూడా తెలుగు, త‌మిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్ క‌లిసి తొలి రోజు 24 ల‌క్ష‌ల హిట్స్‌ని దక్కించుకుంది. అంటే, జ‌న‌తా సాధించిన రికార్డ్ అసాధార‌ణం అన్న‌మాట‌.

ధృవ‌, శాత‌క‌ర్ణి టీజ‌ర్‌లకు రీచ్ త‌గ్గ‌డానికి కార‌ణం పండ‌గ సెల‌వుల‌ట‌. వ‌ర‌స సెల‌వుల‌తో జ‌నాలంతా ఊర్ల‌కు పోవ‌డంతో అక్క‌డ నెట్ సరిగ్గా లేక‌పోవ‌డంతో వ్యూస్ ప‌డిపోయాయ‌నేది కొంద‌రి వాద‌న‌. మ‌రోవైపు, జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ క్రెడిట్‌తో కొర‌టాల శివ కూడా ఉన్నాడ‌ని, మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాల త‌ర్వాత కొరటాల నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతోనే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*