బాలయ్యకు పోటీగా రామ్ చరణ్

balayya

 ఈ దసరాకు ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఆ 5 సినిమాలపై డిస్కషన్ అంతంత మాత్రంగానే ఉంది. వాటికంటే ముఖ్యంగా దసరాకు విడుదలకాబోతున్న బాలయ్య వందో సినిమా టీజరే ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తోంది. దసరా రోజున ఉదయం 8 గంటలకు గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ విడుదల కాబోతోంది. ఏ సినిమాకు రానంత హైప్ ఇప్పుడు ఆ టీజర్ కు వస్తోంది.

అయితే ఈ టీజర్ విషయంలో కూడా బాలయ్యకు మెగా కాంపౌండ్ నుంచి పోటీ తప్పడం లేదు. బాలయ్య సినిమా విడుదలకు చిరంజీవి నుంచి పోటీ ఉంది. శాతకర్ణి విడుదలవుతున్న టైమ్ లోనే చిరు నటిస్తున్న 150వ సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు శాతకర్ణి టీజర్ రిలీజ్ కు… చిరు తనయుడు చెర్రీ పోటీగా నిలిచాడు.

అవును… శాతకర్ణి టీజర్ విడుదలైన కొద్ది గంటలకే తన కొత్త సినిమా ధృవ టీజర్ విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నాడు. సో.. ఈ రెండు టీజర్లు ఈ దసరాను మరింత కలర్ ఫుల్ గా మార్చేయబోతున్నాయన్నమాట. అంటే.. ఒకే రోజు అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారు. అయితే శాతకర్ణి టీజర్ డేట్ అధికారికంగా ఫిక్స్ అయింది కానీ ధృవ టీజర్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ అవ్వలేదు. రేపోమాపో అల్లు అరవింద్ దీనిపై ఓ ప్రకటన చేయబోతున్నాడు.

Loading...

Leave a Reply

*