మెగా అక్కాత‌మ్ముళ్ల గొడ‌వ‌లు.. త‌మ్ముడు మామ‌తో.. అక్క హీరోయిన్‌తో..!

ram-charan-and-sushmita-in-new-controversy

మెగా ఫ్యామిలీకి టైమ్ క‌లిసి వ‌స్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. కొన్ని రోజులుగా చిరు ఫ్యామిలీ వివాదాల‌తోనే న్యూస్‌లో ఉంటోంది. గ‌త వారం రోజులుగా చెర్రీ.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో, త‌న మేన‌మామ అల్లు అర‌వింద్‌తో గొడ‌వ‌లు ప‌డుతున్నాడనే ప్ర‌చారం హాట్ హాట్‌గా సాగుతోంది. గీతా ఆర్ట్స్ పీఆర్‌వీల విష‌యంతోపాటు అదే సంస్థ‌కు చెందిన ఓ కో డైరెక్ట‌ర్‌ని కూడా త‌న లేటెస్ట్ మూవీ ధృవ నుంచి తీసి వేశార‌నే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి.త‌న కెరీర్ విష‌యంలో జ‌రిగిన కొన్ని పొర‌పాట్ల‌కు, అటు బ‌న్ని గ్రాఫ్ పెర‌గ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కాస్త అస‌హ‌నంగా ఉన్నాడ‌ని, అందుకే, మేన‌మామ‌ని కూడా న‌మ్మ‌డం లేద‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోన్న‌మాట‌. గత కొంత‌కాలంగా మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఈ వార్ హాట్ హాట్‌గా సాగుతోందని, అది మ‌రోసారి బ‌య‌ట‌పడిందని చెప్పుకుంటున్నారు.

ఈ మేట‌ర్ ఇలా ఉంటే.. తాజాగా వివాదంలో నిలిచింది మెగా డాట‌ర్ సుష్మిత‌. డ్ర‌స్ విష‌యంలో చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో ఐటెం సాంగ్ కోసం తీసుకున్న కేథ‌రిన్ ట్రెసాకి, ఇదే సినిమాకి స్ట‌యిలిస్ట్‌గా ప‌నిచేస్తున్న సుష్మిత‌కు మ‌ధ్య వార్ న‌డిచింద‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. అది పెరిగి పెద్ద‌ది కావ‌డంతో కేథ‌రిన్‌ను టోటల్‌గా ఆ సాంగ్ నుంచే త‌ప్పించాల్సిన సీన్ క్రియేట్ అయింద‌ని స‌మాచారం. దీంతో, ఆమె స్థానంలో ల‌క్ష్మీరాయ్ వ‌చ్చి చేరిందట‌. ఇలా, వారం గ్యాప్‌లో మెగా డాట‌ర్‌, మెగా వార‌సుడు ఇలా హెడ్ లైన్‌గా మార‌డం.. మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారింద‌ట‌. మ‌రి, ఈ కాంట్ర‌వ‌ర్సీల‌కు ధృవ హిట్‌తో రామ్‌చ‌ర‌ణ్‌, ఖైదీనెంబ‌ర్ 150తో సుష్మిత ఎండ్ కార్డ్ వేస్తారేమో చూడాలి.

Loading...

Leave a Reply

*