రామ్ చరణ్, బాలయ్య కలిసి ఫారిన్ టూర్ వెళ్తున్నారు…

ram

ప్రస్తుతానికి బాలయ్య బాబుకు జార్జియాకు చాలా లింక్ ఉంది. ఎఁదుకంటే… బాలయ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి షెడ్యూల్ ను మొదట జార్జియాలోనే ప్రారంభించారు. జార్జియాలో కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించిన తర్వాతే లోకల్ గా మరో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇప్పుడు అదే దేశంలో చెర్రీకి కూడా అనుబంధం ఏర్పడింది. కుదిరితే బాలయ్యతో కలిసి చెర్రీ కూడా జార్జియా వెళ్లాలనుకుంటున్నాడు.గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి తాజాగా మరో భారీ షెడ్యూల్ ముగిసింది. మధ్యప్రదేశ్ లోని కొన్ని చారిత్రక ప్రాంతాల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

తిరిగి యూనిట్ మరోసారి జార్జియా వెళ్లాలనుకుంటోంది. మరికొన్ని యుద్ధ సన్నివేశాల్ని అక్కడ పిక్చరైజ్ చేయాలని భావిస్తున్నారు. స్థానికంగా సెట్ వేసి యుద్ధాలు తీసేకంటే… నేచురల్ గా ఉండే జార్జియా లొకేషన్లే బెటరని భావిస్తున్నారు.ఇటు చరణ్ నటిస్తున్న ధృవ సినిమా కూడా ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. 6 రోజుల టాకీపార్ట్, 2 పాటలు మినహా సినిమా పూర్తయింది. మిగిలిన ఆ 2 పాటల షూటింగ్ కోసం జార్జియా వెళ్లాలని అనుకుంటోందట యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే శాతకర్ణి టీం, ధృవ టీం ఒకేసారి జార్జియాలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి.

 

Loading...

Leave a Reply

*