కాజల్, తమన్న బాటలో రకుల్ కూడా…

untitled-6

ఓ అరుదైన రికార్డు సృష్టించడానికి కాజల్ కు దాదాపు పదేళ్లు పట్టింది. అటు తమన్నకు కూడా ఆ రికార్డు సృష్టించడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. కానీ అదే రికార్డును సమం చేయడానికి రకుల్ ప్రీత్ సింగ్ కు మాత్రం జస్ట్ మూడేళ్లు పట్టింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా… ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో ఉన్న స్టార్ హీరోల్ని కవర్ చేయడమే ఆ రికార్డు. పవన్-చెర్రీ-బన్నీలను కవర్ చేసిన అరుదైన రికార్డు ఇప్పటివరకు కాజల్, తమన్న, శృతిహాసన్ పేరిట మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ రికార్డును రకుల్ కూడా అందుకోబోతోంది.

చెర్రీ,బన్నీతో అప్పటికే పలు సినిమాలు చేసిన కాజల్.. ఎట్టకేలకు పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయగలిగింది. అలా మెగా హీరోలు ముగ్గుర్నీ కవర్ చేయగలిగింది. ఆ తర్వాత తమన్న కూడా చెర్రీ-బన్నీలతో సినిమాలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసింది. అటు శృతిహాసన్ కూడా చెర్రీ-బన్నీతో సినిమాలు కంప్లీట్ చేయకుండానే పవన్ తో గబ్బర్ సింగ్ మూవీ చేసింది. ఇప్పుడు రకుల్ కూడా… చెర్రీ-బన్నీలతో సినిమాలు పూర్తిచేసింది. ప్రస్తుతం పవన్ సరసన ఛాన్స్ అందుకోవడానికి ఒక్కమెట్టు దూరంలో ఉంది.

నేసన్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు పవన్. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నయన్ ను అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. రకుల్ కూడా పవన్ సరసన నటించేందుకు వెయిట్ చేస్తోంది.

Loading...

Leave a Reply

*