ముద్దుగుమ్మలిద్దరూ మందుకొడుతూ మాట్లాడుకున్నారు..

untitled-2

ఒకరేమో బుల్లితెరపై హాట్. ఇంకొకరు వెండితెరపై యమ హీట్. ఆ ఇద్దరు కలిశారు. అది కూడా ఎక్కడో కాదు. ఓ మాంఛి ఫైవ్ స్టార్ బార్ లో. ఎంచక్కా మందుకొడుతూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. వాళ్లు మరెవరో కాదు. హాట్ యాంకర్ అనసూయ. హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఓ టీవీ ఛానెల్.. ఈ ఇంటర్య్యూను ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. పట్టపగలు ఓ బార్ లో ఈ సీన్ ఎరేంజ్ చేసింది.

డేట్ విద్ అనసూయ కార్యక్రమం కోసం అనసూయ రకరకాల వేషాలు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య, నిఖిల్ లాంటి హీరోలతో ఈ షోలో ఆడిపాడిన ఈ బ్యూటీ… ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ను చా చాట్ షో కోసం ఆహ్వానించింది. రకుల్ వచ్చీరాగానే ఛీర్స్ చెప్పింది. బార్ వాతావరణం ఎంతో అలవాటు ఉన్నట్టుగా ఇద్దరూ బిహేవ్ చేశారు. ఏమాత్రం అసౌకర్యం ఫీల్ అవ్వకుండా మాట్లాడుకున్నారు. పనిలో పనిగా ఎవరికి నచ్చిన బ్రాండ్ గురించి వాళ్లు ఆఫ్ స్క్రీన్ చర్చించుకోవడం కొసమెరుపు.

తను మందుకొడతానని విషయాన్ని అనసూయ ఇప్పటికే ఒప్పుకుంది. తన పెగ్ వేస్తే భర్తకు నరకమే అనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. రకుల్ కూడా తన బ్రాండ్ ఏంటో అనసూయకు చెప్పేసిందట. చూస్తుంటే.. ఈ బ్యాచ్ అందరికీ తెరవెనక మంచి బార్ కనెక్షన్ ఉన్నట్టు ఉంది.

Loading...

Leave a Reply

*