విశాల్ కే హ్యాండ్ ఇచ్చింది… ఇక అంతే సంగతులు…

untitled-6

తమిళనాట ప్రస్తుతం ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ హీరో విశాల్ తో పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. ఎందుకంటే… కోలీవుడ్ లో విశాల్ ఇప్పుడు మోస్ట్ పవర్ ఫుల్. కేవలం హీరోగానే కాకుండా.. నడిగర్ సంఘంలో కీలక సభ్యుడిగా విశాల్ ఓ రేంజ్ లో |అక్కడ చక్రం తిప్పుతున్నాడు. అందుకే విశాల్ అంటే చాలామంది భయభక్తులతో మెలుగుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట. అలాంటి హీరోకు మన రకుల్ ప్రీత్ సింగ్ హ్యాండ్ ఇచ్చింది.

త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశాడు విశాల్. ఈ సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తప్పుకుందట. తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో విశాల్ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో.. జెంటిల్ మన్ సినిమాలో నటించిన అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, తనకు హ్యాండ్ ఇచ్చిన రకుల్ ను విశాల్ వదిలిపెడతాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. విశాల్ ను హర్ట్ చేసిన రకుల్ కు ఇకపై కోలీవుడ్ లో ఎంట్రీ ఉండదని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. అటు విశాల్ కూడా కోలీవుడ్ లోకి ఆమె ఎలా అడుగుపెడుతుందో చూస్తానంటూ సన్నిహితుల దగ్గర చిన్నపాటి సవాల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పాపం రకుల్… ఆమె సాంబార్ కలలకు విశాల్ పెద్ద గండి కొట్టబోతున్నాడన్నమాట.

Loading...

Leave a Reply

*