మరోసారి తెరపైకి కుమారి జోడీ

raj-tarun-and-hebba-patel

కుమారి 21 f చిత్రంలో తొలిసారిగా నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు రాజ్ తరుణ్ – హేబ్బా పటేల్. ఆ సినిమాలో వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఒక దశలో వాళ్లిద్దరూ లవ్ లో పడ్డారే రూమర్లు కూడా వచ్చాయంటే, కుమారి 21-ఎఫ్ ఇంపాక్ట్ ఎంత పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా తర్వాత ఈడో రకం ఆడో రకం చిత్రంలో నటించి దాంట్లో కూడా సక్సెస్ అయ్యారు ఈ జంట. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసేందుకు రంగం సిద్ధం అయింది. ఇక ఈ జంటని మళ్ళీ కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో తెలుసా …….. వెలిగొండ శ్రీనివాస్ అనే రచయిత .

ఇన్నాళ్ళు రచయితగా వర్క్ చేసిన ఇతగాడు మెగా ఫోన్ పట్టడానికి సిద్దమయ్యాడు. రాజ్ తరణ్ కు ఓ కథను కూడా వినిపించాడట. స్టోరీలైన్ రాజ్ తరుణ్ కు బాగా నచ్చిందట. హీరోయిన్ గా హెబ్బా పటేల్ ను తీసుకోమని.. రాజ్ తరుణ్ వెలిగొండకు సూచించాడట. అలా రాజ్ తరుణ్-హెబ్బా పడేల్ జోడీ మరోసారి తెరపైకి రాబోతోందన్నమాట. అన్నట్టు ప్రస్తుతం హెబ్బా నటిస్తున్న ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో కూడా రాజ్ తరుణ్ ఉన్నాడు. హెబ్బాపై ఉన్న అభిమానంతో ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడు రాజ్ తరుణ్. ఇలా ఇండస్ట్రీలో హెబ్బా కోసం తను చేయాల్సిందంతా చేస్తున్నాడు ఈ కుర్రహీరో.

Loading...

Leave a Reply

*