మ‌రో కొత్త వివాదంలో ర‌జ‌నీకాంత్ క‌బాలి..!

rajanai

ర‌జ‌నీకాంత్ గ్లోబల్ స్టార్‌. భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ఒక ఫినామినాగా ఎదిగారు. ఆయ‌న‌కి ఎంత పాపులారిటీ ఉందో.. ఆయ‌న చుట్టూ వివాదాలు కూడా అదే రేంజ్‌లో న‌డుస్తుంటాయి. క‌బాలికి ముందు ఆయ‌న న‌టించిన లింగ‌, విక్ర‌మ‌సింహ చుట్టూ బోలెడు వివాదం న‌డిచింది. క‌బాలి రిలీజ్‌కి ముందు అదే రేంజ్‌లో కాంట్ర‌వ‌ర్సీ వినిపించినా.. ఆ సినిమా క్రేజ్ ముందు అవేవీ నిల‌బ‌డ‌లేక‌పోయాయి. క‌బాలి సాఫీగా విడుద‌ల అవ‌డం, భారీ లాభాలు క‌ళ్ల‌జూడ‌డంతో ఇక వివాదాలేవీ లేవ‌నుకున్నారు. కానీ, ఈసారి విడుద‌ల‌యిన త‌ర్వాత‌, ఇక ఏమీ లేద‌నుకున్న టైమ్‌లో కొత్త వివాదం చుట్టుముట్టింది.

క‌బాలి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఎలా కల్పిస్తారంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. తమిళ భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా, తమిళంలో పేరు పెట్టే చిత్రాలకు, హింస, అశ్లీలం లేని చిత్రాలకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తోంది. ఇందు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గిన ఈ కమిటీ అర్హత లేకున్నా భారీ బడ్జెట్‌ చిత్రాలకు పన్ను రాయితీ కల్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందుకు ‘కబాలి’ని పిటీషన్‌లో చేర్చారు. ఈ చిత్రంలో రజనీకాంత్ నటించారన్న ఒకే ఒక్క కారణంగానే పన్ను రాయితీ కల్పించారన్నారు. దీంతో, ఈ చిత్రానికి పన్ను రాయితీ కల్పిస్తూ రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ చిత్రానికి చెల్లించాల్సిన మొత్తం పన్ను ఆ చిత్ర నిర్మాత చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది. క‌బాలి వివాదంలో చిక్కుకోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మ‌రి, దీనిపై తీర్పు ఎలా ఉంటుందో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Loading...

Leave a Reply

*