రాజ‌మౌళి బాట‌లో రజినీకాంత్‌

rajini

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌…. త‌మిళ‌నాడుకే కాదు ఆల్ ఇండియాకే సూప‌ర్‌స్టార్‌…. ర‌జినీ.. ఆ పేరు వింటేనే గుండె ఝ‌ల్లుమంటుంది.. ర‌జినీ పేరు లోనే వైబ్రేష‌న్స్ ఉన్నాయి…. ఆయ‌న క‌బాలి డా అంటే త‌మిళ‌నాడు జ‌న‌మే కాదే… ఇండియా జ‌నమంతా జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు… క‌బాలి సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయినా 200 కోట్లు వ‌సూలు చేసిందంటే అది కేవ‌లం ర‌జినీ స్టామినాయే…. అంత‌టి సూప‌ర్‌స్టార్ రజినీ కూడా ఇప్పుడు రాజ‌మౌళి బాట‌లో న‌డుస్తున్నాట్ట‌…. అలా న‌డ‌వ‌క త‌ప్ప‌లేదుట‌… అస‌లు విష‌యం ఏంటంటే…రాజ‌మౌళి బాహుబ‌లిపై పెట్టిన బ‌డ్జెట్‌ని చూస్తే ఆ సినిమా కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రీజ‌న‌ల్ సినిమాగా రిలీజ్ అయిఉంటే వ‌ర్క‌వుట్ అయి ఉండేదికాదు… అందుకని రానా స‌హాయంతో బాలీవుడ్‌లో పెద్ద ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌ని రంగంలోకి తీసుకునివ‌చ్చి అతి భారీ సంచ‌ల‌నం క్రియేట్ చేశారు…

అందువ‌ల్లే బాహుబ‌లి సినిమాకు ఆల్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది… అదే మోడ‌ల్‌ని ఇప్పుడు రజినీకాంత్ సినిమా కోసం కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వాడ‌నున్నాడు….. ర‌జినీకాంత్ సినిమా 2.0 కోసం ముంబైలో పెద్ద గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు… ఆ ఈవెంట్‌లో 2.0 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేస్తారుట‌…ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌కి సంబంధించిన పెద్ద‌పెద్ద త‌ల‌కాయల‌ను ఆహ్వానించి సినిమాకు క్రేజ్ పెంచాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం….బాలీవుడ్లో ఒక పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌పై శంక‌ర్ క‌ళ్లు ఉన్నాయ‌ని స‌మాచారం… ప్ర‌ధాన‌వంగా వారిమీదే ఈ ఈవెంట్ ఫోక‌స్ అని చెబుతున్నారు…అయితే ఆ బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ య‌జ‌మానులు ఎవ‌రు అనేది ప్ర‌స్తుతం సీక్రెట్‌గా ఉంచారు…

ఇది కోలీవుడ్‌లో స‌స్పెన్స్‌కు తెర తీస్తోంది…. ఏదీ ఏమైనా అతి భారీ సినిమాలు తీసే శంక‌ర్‌, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్… ఈ ఇద్ద‌రు ఇప్పుడు రాజ‌మౌళి బాట‌లో న‌డుస్తుండ‌డం తెలుగువాళ్లంద‌రికి ఆనందం, గ‌ర్వం క‌లిగించే విష‌యం అని చెప్ప‌వ‌చ్చు.

Loading...

Leave a Reply

*