రాజ‌మౌళి షాకింగ్ డెసిష‌న్‌… తెలుగు హీరోలంద‌రూ షాక్‌..!

untitled-13

రాజ‌మౌళి అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారా..? బాహుబ‌లి ది కన్‌క్లూజ‌న్ త‌ర్వాత ఆయ‌న చెయ్య‌బోయే సినిమాపై ఇప్ప‌టినుంచే ఆస‌క్తి నెల‌కొంది.
ప్ర‌స్తుతం షూటింగ్ క్ల‌యిమాక్స్‌లో ఉన్న ఈ సినిమా త‌ర్వాత జ‌క్క‌న్న దాదాపు మూడు నెల‌లు పోస్ట్ ప్రొడక్ష‌న్‌లోనే బిజీగా ఉండ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది బాహుబ‌లి 2. దీని త‌ర్వాత జ‌క్క‌న్న ఇక టాలీవుడ్‌కి గుడ్ బై చెప్ప‌నున్నాడా? ఆయ‌న ఫోక‌స్ జాతీయ స్థాయి, అంత‌ర్జాతీయ స్థాయికి చేరనుందా? బాలీవుడ్ లేదా హాలీవుడ్‌లో ఓ సినిమాకి జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడా? లేక‌, టాలీవుడ్‌లోనే ఓ సినిమా క‌మిట్ అవ‌నున్నాడా..?

బాహుబ‌లి 2 త‌ర్వాత జ‌క్క‌న్న కొత్త‌ చిత్రంపై ఇప్ప‌టికే అనేక ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ లేదా ఎన్టీఆర్‌తో ఓ సినిమాకి ప్లాన్ చేస్తాడ‌ని భావించారంతా. కానీ, ఆయ‌నకు ఈగ సీక్వెల్‌పై మ‌న‌సు ప‌డింద‌ట‌. దీనికి సంబంధించి ఒక లైన్ రాజ‌మౌళి మ‌దిలో మెదిలింద‌ని, దానిని బాగా డెవ‌లప్ చెయ్య‌మ‌ని తండ్రి, త‌న సినిమాల‌కు క‌థా ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కి చెప్పాడ‌ట‌. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా ఇదే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

ఈ క‌థ రెడీ అయినా, లాస్ట్ మినిట్ వర‌కు వెయిట్ చేస‌యినా స‌రే.. అమీర్ ఖాన్ ఓకే అంటే సినిమా చెయ్యాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. బాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ అయితే భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్ల మార్కెట్ ఈజీగా చెయ్యొచ్చ‌నేది ఆలోచ‌న‌. అందుకే, బాహుబ‌లి 2 రేంజ్‌లోనే ఆ సినిమాని దేశంలోని అన్ని భాష‌ల‌తో పాటు హాలీవుడ్ రేంజ్‌లో రిలీజ్ చేసేలా యోచిస్తున్నాడు రాజ‌మౌళి. ఇలా, ఆయ‌న సినిమా కాన్వాస్ రేంజ్ పెర‌గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అంటే, రాజ‌మౌళి నుంచి ఫ్యూచ‌ర్‌లో తెలుగు సినిమాలు ఊహించ‌డం క‌ష్ట‌మేన‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*